ATP: జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారి స్వయ గణన నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TPT: ఏర్పేడు మండలం మర్రిమందలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానంలో వెలసిన శ్రీ వాంఛ కల్పలత గణపతి స్వామి వారికి బుధవారం ప్రత్యేక అభిషేకం, అలంకరణ పూజలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
BPT: ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. సెకండియర్‌లో 75 శాతం, ఫస్టియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 8,358 మంది పరీక్ష రాయగా.. 6,252 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో 8,831 మందికి గానూ 6,361 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరగనున్నాయి. ఫీజు చెల్లింపునకు అధికారులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు గడువు ఇచ్చారు.
E.G: రంగంపేట మండలం ST రాజపురంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని గ్రామస్తులు హర్షo వ్యక్తం చేశారు. SVS స్కీములో రూ. 83.25 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రూ.30 లక్షలతో 10 సిమెంటు రోడ్లకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఈ బురద రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా ఉండేదని నేడు సమస్యకు పరిష్కారo అయ్యిందని వెల్లడించారు.
GNTR: ఇంటర్ ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. ఫస్టియర్, సెకండియర్‌లలో 88 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 30,551 మంది పరీక్ష రాయగా.. 26,856 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో 33,643 మందికి గానూ 29,530 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు, ఫీజు చెల్లింపునకు అధికారులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు గడువు ఇచ్చారు.
కృష్ణా జిల్లా విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 22,403 మందిలో 20,142 మంది ఉత్తీర్ణులై 90% ఫలితాన్ని సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 21,669 మందిలో 19,952 మంది పాస్ అయ్యి 92% ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలతో జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.
BPT: పిట్టలవానిపాలెం మండలంలోని చిందులు గ్రామంలో బుధవారం ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ తదితరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ, ఉల్లంఘనలకు పాల్పడిన వారికి హెచ్చరికలు జారీ చేశారు.
GNTR: రాజధాని పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు సరైన స్పెల్లింగ్ వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై అన్ని అధికారిక ఉత్తర్వులు, రికార్డుల్లో ‘Amaravati’ అని మాత్రమే రాయాలని స్పష్టం చేసింది. కొందరు ‘Amaravathi’ అని తప్పుగా రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
CTR: చిట్రెడ్డి పల్లె గ్రామంలో కన్నుల పండువగా నడివీధి గంగమ్మ జాతర ప్రారంభమైనది. నడి వీధిలో గంగమ్మను అత్యంత సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రతి ఇంటి వద్ద నుంచి అష్టదిగ్పాలకులలో వెలసిన అమ్మవార్లకు జంతు బలులు సమర్పించి మొక్కులు చెల్లించారు. గ్రామంలో సందడి నెలకొంది.
ASR: గూడెంకొత్త వీధి స్థానిక పంచాయతీ కేంద్రంలో గురువారం గ్రామసభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి పండ్ర పాల్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గ్రామాల సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువస్తే ప్రత్యేక తీర్మానాలు చేసి త్వరితగతిన పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KDP: కలసపాడు పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సుబహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 8 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ATP: శింగనమల నియోజకవర్గం నార్పలలో గ్రామ సంఘ సహాయకులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి 200 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. డిజిటల్ శక్తి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేసేందుకు ఈ ఫోన్లు దోహదపడతాయని వివరించారు.
NDL: నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పత్తికొండలో CITU ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ.. 17న నంద్యాలలో భారీ బహిరంగ సభ, ర్యాలీ ఉంటుందని, ఈ మహాసభల్లో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విభజన పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ ఇవ్వాలన్నారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరుకు విచ్చేసిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందజేశారు. నెల్లూరు రూరల్‌కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు వారు పేర్కొన్నారు.
NLR: YS జగన్ కొద్దిసేపటి క్రితం జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన ఎలిప్యాడ్‌కు చేరుకున్నారు. కాగా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలిసి జగన్ బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు పయనమయ్యారు.