ELR: భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో హౌసింగ్ కాలనీ నందు రూ.1.50 లక్షలు వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శుక్రవారం ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చేయటమే NDA ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా, ప్రతినిధులు పాల్గొన్నారు.