నెల్లూరు: నగరంలో మాగుంట లేఔట్‌లోని ఒంగోలు మాజీ MP మాగుంట పార్వతమ్మ పార్థీవదేహాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించి, నివాళులర్పించారు. ప్రేమ, అనురాగాలు పంచి తల్లిలా ఆదరించే మాతృమూర్తి పార్వతమ్మ మృతి తీరని లోటని, ఎంపీగా ఆమె సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.