KDP: కమలాపురం నగర పంచాయతీ కమిషనర్గా పగడాల జగన్నాథం శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నగర పంచాయతీ సిబ్బంది ఆయనను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలాపురం నగర పంచాయతీలోని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అపరిశుభ్రత తొలగించి పరిశుభ్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.