SKLM: గత ప్రభుత్వంలా కాకుండా ప్రస్తుత తమ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయలకు అనుకూలమని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ స్పష్టం చేశారు. ఏపీటీఎఫ్ 80 వసంతాల ఓక్ జూబ్లీ వేడుకల సందర్భంగా జిల్లాలో జరిగిన విద్యా వైజ్ఞానిక జిల్లా మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు మంచి వార్తలే వింటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.