నెల్లూరు: కొడవలూరు మండలంలో తాటాకుల దిన్నె అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం హ్యాండ్ వాష్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చేతులు ఎన్ని విధాలుగా కడగాలి, చేతుల పరిశుభ్రతపై వారికి అవగాహన కల్పించారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మావతమ్మ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.