»Ys Jagan Taking Oath With Me After Ministers Is Against Traditions
YS Jagan: మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈక్రమంలో వైస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.
YS Jagan: Taking oath with me after ministers is against traditions
YS Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈక్రమంలో వైస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధం అని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని జగన్ అన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది. 10శాతం సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని జగన్ అన్నారు.
పార్లమెంట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధన పాటించడంలేదు. అధికార కూటమి, స్పీకర్ జగన్‌పై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. 1984లో లోక్‌సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుంది. సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.
1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లేకపోయిన పి.జనార్దన్‌రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు భాజపా కేవలం 3 సీట్లు సాధించింది. అయిన ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నా అని జగన్ తెలిపారు.