»Classic Legends Bsa Gold Star New British Bike To Compete With The Royal Enfield Bike
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు పోటీగా బ్రీటీష్ సరికొత్త బైక్.. ఫీచర్స్ ఇవే
భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల్లో కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్ని మోడల్స్ వచ్చిన ఎవర్ గ్రీన్ బైక్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. ఇప్పుడు దీనికి పోటీగా బ్రీటీష్ కంపెనీ నుంచి కొత్త బైక్ రానుంది.
Royal Enfield: భారతీయ బైక్స్ మార్కెట్లో ఎన్ని బైకులు ఉన్నా రాయల్ ఎన్ఫీల్డ్ బండికి ఉన్న క్రేజ్ వేరే ఉంటుంది. అది రెట్రో లుక్ ఉండడమే దీనికా కారణం. ఇప్పటి వరకు ఎన్ని స్పోర్ట్స్ బైక్స్ వచ్చినా సరే దాని ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. దీనికి పోటీ ఇచ్చేందుకు అనేక రకాల కంపెనీలు ముందుకు వచ్చాయి. కొత్త మోడళ్లను తీసుకొచ్చారు. దానిలో భాగంగా ట్రయంఫ్, హార్లే డేవిడ్ సన్ లాంటి విదేశీ కంపెనీలతో బజాజ్, హీరో మోటోకార్ప్ కలిసి కొత్త బైకులను రంగంలోకి దింపాయి. తాజాగా మరో విదేశి కంపెనీ భారత మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధం అయింది. జావా, యజ్డీ బ్రాండ్లపై బైక్స్ తయారుచేసే క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) అనే బ్రిటీష్ కంపెనీ నుంచి ఇప్పుడు ఓ బైక్ భారత మార్కెట్లో అడుగుపెట్టబోతుంది.
చదవండి:Karnataka: కృత్రిమ రంగు వాడకంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బీఎస్ఏ గోల్డ్ స్టార్ పేరుతో క్లాసిక్ లెజెండ్స్ కంపెనీ ఓ బైకును తీసుకొస్తుంది. త్వరలోనే ఇది భారతీయ మార్కెట్లోకి రానుంది. ఈ మేరకు బైక్‌కు సంబంధించి టీజర్ కూడా విడుదల చేసింది. అయితే ఈ బైక్ అంతర్జాతీయ మార్కెట్లో ఇదివరకే ఉంది. ఇప్పుడు మన దగ్గరకు రాబోతుంది. దీని ఫీచర్లు ఒకసారి చూస్తే.. 652 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో కలిగి ఉంది. 45 బీహెచ్పీ పవర్, 55ఎన్ఎం పీక్ టార్క్‌తో వస్తుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, 6 స్పీడ్ గేర్ బాక్స్, 12 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న ఈ బైక్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఉంది. అయితే భారత మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు ఇంకా ఏమైనా మార్పులు చేస్తారేమో అనేది తెలియాలి. అంతర్జాతీయంగా ఈ బైక్ ధర రూ.3 లక్షల పైనే ఉంది. మరీ ఇండియాలో మార్కెట్లో ఎంత ఉండబోతుంది అనేది చూడాలి. ఆగస్టు 15న ఈ బైక్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకొస్తారని సమాచారం.
చదవండి:Gold Rates Today : వరుసగా మూడో రోజూ స్వల్పంగా తగ్గిన వెండి, బంగారం ధరలు