»Royal Enfield New Bullet Ready Released On 1st September
Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బుల్లెట్ రెడీ..సెప్టెంబర్ 1న విడుదల
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. 350 మోడల్‌ను సెప్టెంబర్ 1వ తేదిన ఆవిష్కరిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfiels) బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ప్రీమియం బైకుల కంపెనీ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త తరం బుల్లెట్ 350 (RE Bullet 350)ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదిన ఈ 350 మోడల్‌ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్లో క్లాసిక్ 350, హంటర్ 350 మోడల్స్ ఉన్నాయి. వీటికి మధ్యస్థంగానే కొత్త మోడల్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడున్నవాటిల్లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అత్యంత చౌక బైక్‌గా హంటర్ 350 (RE Hunter 350) నిలుస్తుంది. దీనిని షోరమ్ ధర రూ.1.5 లక్షలకే విక్రయిస్తోంది.
ముఖ్యంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్350 మోడల్ డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదని కంపెనీ చెబుతోంది. సంప్రదాయ బుల్లెట్ మాదిరిగానే ఈ కొత్త మోడల్ (New Model) ఉంటుందని, బాడీ ప్యానెల్స్‌లో కొత్తదనం ఉంటుందని, పొడవుగా ఒకే సీటుతో ఈ బైక్ ఉంటుందని యాజమాన్యం వెల్లడించింది. ముందు భాగంలో చూస్తే గుండ్రటి హాలోజెన్ హెడ్ ల్యాంప్‌ను ఏర్పాటు చేయడంతో పాటుగా 41 ఎంఎం టెలీస్కోపిక్ ఫోర్క్‌లు ఉన్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ 350 మోడల్ (Royal Enfield 350 Model) వెనుక భాగంలో 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోదగ్గ ట్విన్ షాకబ్జార్బర్లు ఉండగా ఈ బైక్‌కు జే సిరీస్ ఇంజిన్‌ను అమర్చారు. ఇందులో ఎయిర్ ఆయిల్డ్ కూల్ టెక్నాలజీ ఉంది. గరిష్ఠంగా చూస్తే ఇది 20 బీహెచ్పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండగా 27 ఎన్ఎం టార్క్ దీని నుంచి విడుదల కానుంది. ఇకపోతే ఈ బైక్‌లో మొత్తం 5 గేర్లు అనేవి ఉంటాయి. హంటర్ 350, క్లాసిక్ 350 ఇంజిన్ ఇందులో కూడా ఉంటుంది కానీ ట్యూనింగ్‌లో కొద్దిగా మార్పులు చేశారు. అయితే ఈ బైక్ ధర హంటర్ కంటే తక్కువ నిర్ణయిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.