»Independence Day Sale Spicejet Bumper Offer For Air Travelers Flight Ticket For Just Rs 1515
Spicejet: బంపర్ ఆఫర్.. రూ.1515కే ఫ్లైట్ టికెట్
విమానంలో ప్రయానం అంటే అందిరికి సారదానే ఉంటుంంది కాని అది సాధారణ ప్రజలకు అందదని చాలా మంది ప్రయాణాలకు దాని వైపు కూడా తొంగి చూడారు. అలాంటి వారికోసమే స్పెస్‌జెట్ ఎయిర్‌లైన్ సంస్థ కేవలం రూ.1515కే ఫ్లైట్ టికెట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
Independence Day Sale, Spicejet bumper offer for air travelers.. flight ticket for just Rs.1515
Spicejet : ధనవంతులు నిత్యం ఫ్లైట్ల(flights)లో ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే సామాన్యులకు కూడా ప్రయాణాలు చేయాలని ఉంటుంది. కానీ అంత చార్జీలు పెట్టలేమని ఆశలను చంపుకుంటారు. అయితే విమాన ప్రయాణం చేసేవారికి నిత్యం ఎన్నో ఆఫర్లు ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించడానికి చాలా కంపెనీలు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తాయి. వివిధ రకాల ప్యాకేజీలతో తక్కువ ధర టికెట్లో ప్రయాణించే వెసులుబాటు కూడా కల్పిస్తాయి. దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ కంపెనీలలో ఒకటైన స్పైస్‌జెట్(Spicejet) తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్(offer)ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు రూ.1,515తో విమానంలో ప్రయాణించే అవకాశాన్ని పొందవచ్చు. స్పెషల్ ఇన్క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్ కింద కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. స్పైస్‌జెట్ విక్రయాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 20 వరకు కొనసాగుతాయని విమానయాన సంస్థ తెలిపింది. ఆఫర్ కింద మీరు ఈ బడ్జెట్లో వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి మార్చి 30, 2024 వరకు ప్రయాణించవచ్చు.
అలాగే ఈ చౌక టికెట్(flight ticket) 1515 రూపాయలకే తీసుకున్నా సరే రూ.2,000 విలువైన విమాన వోచర్లను కూడా ఉచితంగా అందిస్తోంది. అంతే కాకుండా రూ.15కి ప్రాధాన్యత గల సీటు ఎంపిక చేసుకునే సదుపాయాన్ని కూడా స్పేస్‌జెట్ అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను ఆగస్టు 20 వరకు ఉపయోగించుకోవచ్చు. ముంబై-గోవా, జమ్మూ-శ్రీనగర్, గోవా-ముంబై, గౌహతి-బాగ్డోగ్రా, చెన్నై-హైదరాబాద్ వంటి ప్రముఖ దేశీయ మార్గాలలో రూ.1515కి వన్ వే విమాన ప్రయాణ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ నేరుగా దేశీయ బుకింగ్‌లపై వన్-వే ఛార్జీపై చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ కింద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాధాన్య సీటు కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్ ముగిసిన తరువాత కస్టమర్లు ఏడు రోజుల్లో బుకింగ్‌పై రూ.2,000 విలువైన విమాన వోచర్లను ఉచితంగా పొందవచ్చు. వెబ్సైట్, మొబైల్ యాప్, రిజర్వేషన్లు, ఎంచుకున్న ట్రావెల్ ఏజెంట్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది.