»Daughter Of Malaysian Business Tycoon Gave Up 2000 Crores Of Property For Him Whom She Loved
Love:ప్రేమకోసం 2వేల కోట్ల ఆస్తిని వదులుకుంది.
ధనవంతుల కుటుంబంలో పుట్టిన వారికి ప్రేమలు ఉండవు అంటారు కానీ ఈ సంపన్నురాలు తన ప్రేమ కోసం వేల కోట్ల ఆస్తిని వదులుకుంది. దాదాపు 2 వేల కోట్ల ఆస్తిని వదులుకొని నచ్చినవాడితో సాధారణ జీవితం గడుపుతోంది.
Daughter of Malaysian business tycoon gave up 2000 crores of property for him whom she loved.
Love: ప్రేమగుడ్డిది అని అంటుంటారు. ఈ విషయం తెలిస్తే మీరు కూడా అలానే అనుకుంటారు. కాని అది నాణేనికి ఒక వైపే. ప్రేమించిన వ్యక్తి కోసం వాళ్లు చేసే త్యాగం చూస్తే అది కచ్చితంగా ప్రేమ(Love) అంత గొప్పదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఓ యువతి తాను లవ్(Love) చేసిన ఒక సామాన్యుడి కోసం వేల కోట్ల ఆస్తిని కాదని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వచ్చేసింది. అతడితోనే పెళ్లికి సిద్ధమైంది. మలేషియా బిజినెస్ టైకూన్ (Malaysian tycoon) కుమార్తె అయిన ఆ అమ్మాయి.. ప్రియుడి కోసం అన్నీ వదులుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లి నచ్చిన జీవితం కొనసాగిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మలేషియాకు చెందిన ఏంజెలినా ఫ్రాన్సిస్ ఖూ(Angeline Francis Khoo).. ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్, మాజీ మిస్ మలేసియా పాలైన్ ఛాయ్ దంపతుల కుమార్తె. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో (Oxford University) చదువుకుంటున్న సమయంలో జెడియా అనే స్నేహితుడితో ప్రేమలో పడింది. వివాహం చేసుకునేందుకు సిద్ధమైన ఆమె.. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపింది. కానీ, వారు మాత్రం అందుకు నిరాకరించారు. ఆర్థికపరంగా ఇరు కుటుంబాల్లో భారీ తేడా ఉందన్న వారు అతడిని దూరం కావడమో లేదా వారసత్వాన్ని వదులుకోవడమో చేయాలని ఆదేశించారు. చివరకు ప్రియుడితోనే స్థిరపడాలని నిశ్చయించుకున్న ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. 2008లో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో వారసత్వంగా వచ్చే సుమారు రూ.2వేల కోట్ల ఆస్తిని వదులుకుంది. వివాహం అనంతరం ఇద్దరు కూడా వారి రెండు కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. అయితే, చాలారోజులు దూరంగా ఉన్న ఫ్రాన్సిస్ ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకొనే సమయంలో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఫ్రాన్సిస్ కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లి గురించి గొప్పగా వివరించిన ఆమె.. కుటుంబం కోసం ఆమె చేసిన సేవలను కొనియాడింది. తండ్రిపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం తన ప్రేహ కహాని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.