Hero Harassed Sai Pallavi Sister: చెల్లికి స్టార్ హీరో నుంచి వేధింపులు.. చెప్పుతో కొట్టిన సాయి పల్లవి
పూజా కన్నన్ 2021లో తమిళంలో చితిరై సెవ్వానం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సముద్రఖని పూజా కన్నన్ కు తండ్రి పాత్రలో నటించారు.
Hero Harassed Sai Pallavi Sister: ఈటీవీ డ్యాన్స్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి. అతి తక్కువ సమయంలోనే తన నటనతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఇటు నటన, అటు డ్యాన్స్ లతో అదరగొట్టేస్తోంది. దీంతో అందరూ లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే సాయిపల్లవికి సిస్టర్ ఉన్న సంగతి చాలామందికి తెలుసు. అక్క లాగే చెల్లె కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్. తన పేరు పూజా కన్నన్. ఆమె 2021లో తమిళంలో చితిరై సెవ్వానం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సముద్రఖని పూజా కన్నన్ కు తండ్రి పాత్రలో నటించారు. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
కానీ, పూజా కన్నన్ మాత్రం తన నటనతో మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత పూజా కన్నన్ మరో మూవీలో నటించలేదు. చితిరై సెవ్వానం సినిమాతోనే ఆమె ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యింది. అందుకు ఓ బలమైన కారణమే ఉందట. పూజా కన్నన్ డెబ్యూ మూవీ విడుదల తర్వాత కోలీవుడ్ కు చెందిన ఓ హీరో ఆమెను బాగా వేధింపులకు గురిచేశాడట. నిత్యం పూజా కన్నన్ కి అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ తప్పుగా వ్యవహరించేవాడట. ఈ విషయం సాయి పల్లవికి తెలియడంతో.. సదరు హీరో ఉన్న లోకేషన్ ఎక్కడో తెలుసుకుని మరీ వెళ్లిందట. అందరూ చూస్తుండగానే ఆ హీరోను సాయి పల్లవి చెప్పుతో కొట్టిందని టాక్. ఈ ఘటన జరిగి చాలా రోజులే అవుతున్నా.. ఎక్కడ పరువు పోతుందో అని ఆ హీరో నోరు మెదపలేదని వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో పూజా కన్నన్ సినిమాలు వదిలేయాలని నిర్ణాయించుకుందట.