చంద్రయాన్ 3 (Chandrayaan 3) ప్రయోగం చేపట్టిన ఇస్రో చంద్రుడిపై ల్యాండింగ్ విజయవంతం చేసే ప్రయత్నాలు ఒకవైపు జయుగుతుండగా మరో వైపు కీలకమైన ప్రయోగాలను కూడా సీరియస్ గా దృష్టి పెడుతోంది ఇస్రో. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో (ISRO) వేగం పెంచింది. ప్రస్తుతం కీలకమైన సమయంలో ఇస్రో బిజీ బిజీగా ఉంది. మరోవైపు ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెడుతూ భారత్ ఖ్యాతిని పెంచింది. 2024 ఫిబ్రవరిలో చేపట్టేందుకు ముందస్తు ప్రక్రియ చేపడుతున్న ఇస్రో మరో కీలక ప్రయోగంపై కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తోంది.. అదే ఆదిత్య ఎల్-1 (Aditya L-1) ప్రయోగం. ఇది సూర్యుని పై ప్రయోగం కోసం ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం.
ఇప్పటిదాకా చంద్రుడు(moon), అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో ప్రపంచ దేశాలు గర్వించే రహస్యాలను బయటపెట్టింది. గతంలో చంద్రుడిపై, అంగారకుడిపై నాసా, రష్యా, చైనా లాంటి దేశాలు అనేక ప్రయోగాలు చేపట్టినా అప్పటి వరకు ప్రపంచానికి తెలియని రహస్యాలను తెలిసేలా చేసింది. అదేవిధంగా సూర్యుడి (Sun)పై కూడా అనేక దేశాలు ప్రయోగాలు చేపట్టాయి.. కానీ కొత్త విషయాలను కనిపెట్టడమే ఉద్దేశ్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ అయిన వెంటనే ఈ ప్రయోగం ఉండబోతోంది. ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో PSLV C 57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం జరగనుంది. సూర్యుని హోలో కక్ష్యలోకి అయస్కాంత క్షేత్రం(Magnetic field)లో సంభవించే మార్పులు, కరోనియం (కరోనా) లో ఉన్న పదార్థాలు, సూర్యుని నిత్యం జరుగుతున్న డైనమిక్ ప్రక్రియ ను అధ్యయనం చేయడానికి భారత్ చేస్తున్న తొలి ప్రయోగం ఇది.
ఫోటో స్పియర్(Photo Sphere), క్రోమో స్పియర్ లపై పరిశోధనలు చేసి భూమిపై సూర్యుని వల్ల కలిగే దుష్పరిణామాలకి కారణాలు, పరిష్కారాలు చూపేందుకు అవకాశాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇందుకోసం తయారు చేసిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట (Sriharikota) చేరుకుంది.. బెంగళూరులోని ఇస్రో సైటిలైట్ సెంటర్ లో ఇస్రో సొంతంగా రూపొందించిన ఉపగ్రహం రోడ్డు మార్గం ద్వారా శ్రీహరికోట చేరుకుంది.. రాకెట్ (Rocket) అనుసందాన పనులు కూడా మొదలయ్యాయి. చంద్రయాన్ 3 ల్యాండింగ్ పూర్తయ్యాక ఆదిత్య ఎల్ 1 ప్రయోగం షురూ అవుతుంది.. ఇప్పటికైతే ఏర్పాట్లు మాత్రం దాదాపు పూర్తయినట్లే.. ఇక డేట్స్ మాత్రమే ఓకే కావాల్సివుంది