Alliance: ఎరుపు- పసుపు కలిస్తే వచ్చేది కాషాయమే: రఘురామ థియరీ ఇదీ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. టీడీపీ, జనసేన పొత్తుపై హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీలతో బీజేపీ కూడా కలిసి వస్తోందని.. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలుసు అని చెప్పారు.
Alliance: ఏపీలో టీడీపీ- జనసేన పొత్తుపై ప్రకటన రాగా.. విపక్షాలు ఏకీపారేస్తున్నాయి. ఇదే అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( Raghu Rama krishna raju) కూడా స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ప్రకటన శుభపరిణామం అని కామెంట్ చేశారు. అలాగే ఆ రెండు బీజేపీతో కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ విషయం పవన్‌కు (pawan) కూడా తెలుసు అని హింట్ ఇచ్చారు.
జనసేన ఎరుపు రంగు, టీడీపీ పసుపు రంగులో ఉంటుంది. ఆ రెండు కలిపితే కాషాయం రంగు వస్తుందని రఘురామ (raghu rama) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీ పొత్తుకు బీజేపీ కూడా సమ్మతి ఇస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో గల బీజేపీ పెద్దల మనసులో ఏముందో పవన్‌కు తెలుసున్నారు. అందుకే పొత్తుల గురించి బహిరంగంగా ప్రకటన చేశారని వివరించారు. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలుస్తోందని వివరించారు.
ఆ మూడు పార్టీలు కలిస్తే.. ఇక తిరుగు ఉండదని రఘురామ (raghu rama) అంటున్నారు. 160 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటుందని పేర్కొన్నారు. వైసీపీ ఇక ప్రతిపక్షానికే పరిమితం అవుతోందని వివరించారు. కానీ సర్వే రిపోర్ట్లు మాత్రం వేరుగా ఉన్నాయి. వైసీపీకి కనీసం 120 సీట్లు వస్తాయని చెబుతోంది. అందుకే ఆ పార్టీ, నేతలు ధీమాతో ఉన్నారు.
రఘురామ (raghu rama) వైసీపీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. సొంత పార్టీ, సీఎం జగన్‌ను తిడుతుంటారు. దీంతో పార్టీ పెద్దలు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతని లోక్ సభ్యత్వం తీసివేయాలని స్పీకర్‌ను కూడా కోరారు. రఘురామ (raghu rama) బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. పార్టీలో చేరిక వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు బీజేపీలో చేరే అవకాశం ఉంది.