ఏపీ సీఎం జగన్ దంపతులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవల వాలంటీర్లకు భత్యం ఇచ్చి.. సాక్షి పేపర్ కొనుగోలు చేయాలని ఆదేశించడంపై నోటీసులు ఇచ్చింది.
YS Jagan: ఏపీ సీఎం జగన్ (YS Jagan), ఆయన భార్య భారతికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు భత్యం ఇచ్చింది. దాంతో సాక్షి పేపర్ కొనుగోలు చేయాలని వారికి సూచించింది. ఇదీ పేపర్ సర్క్యులేషన్ పెంచేందుకు చేసిన చర్య.. ఇదే విషయాన్ని ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ధర్మాసనం స్పందించి.. సీఎం జగన్ దంపతులకు నోటీసులు జారీచేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ రోజు జగన్ దంపతులకు నోటీసులు అందజేశారు.
వాస్తవానికి ఏ మీడియా/ పత్రిక సర్క్యులేషన్ పెంచేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. దానిని ఏపీలో ఉల్లండించారు. హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో జగన్ దంపతులకు ఢిల్లీ హైకోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. నిబంధనలను తుంగలో తొక్కి.. రాష్ట్ర ఖజానా నుంచి నిధులు వాడి.. సొంత మీడియా సర్క్యులేషన్ పెంచేందుకు చేసిన చర్యలపై కోర్టు ముందు సమాధానం చెప్పాల్సి ఉంది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (chandrababu) అరెస్ట్ అయ్యారు. అతని అరెస్ట్‌పై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతలో ఢిల్లీ హైకోర్టు సీఎం జగన్ దంపతులకు నోటీసులు జారీచేసింది. ప్రతిపక్ష నేతపై కుట్ర పన్ని.. చివరకు సీఎం కూడా నోటీసులు వచ్చాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.