Chandrababu Arrest: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. జైలులో ఈ రోజు పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ కలిశారు. అయితే ఏపీలో.. మెజార్టీ జనం చంద్రబాబు అరెస్ట్‌ను (Chandrababu Arrest) వ్యతిరేకిస్తున్నారట.. ఇదే విషయాన్ని నెల్లూరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టంచేశారు. ఓ స్వతంత్ర సంస్థ చేసిన సర్వే వివరాలను ఆయన వెల్లడించారు.
700 మందితో నెల్లూరు జిల్లాలో సర్వే చేశారని కోటంరెడ్డి (kotamreddy sridhar reddy) వివరించారు. అందులో 90 శాతం మంది చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకించారని వివరించారు. కేవలం 63 మంది మాత్రమే అరెస్ట్ సమ్మతం అన్నారని.. అందులో కొందరు అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పట్టారని పేర్కొన్నారు. అంటే చంద్రబాబు అరెస్ట్‌ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారట. ఏపీలో, హైదరాబాద్‌లో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
నెల్లూరులో వైసీపీ బలంగా ఉంది. 10 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. సో.. 90 శాతం మంది చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకించారంటే.. మెల్లిగా టీడీపీకి అనుకూలంగా మారుతుంది. ఇదే సిచుయేషన్ మిగతా చోట్ల కూడా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం వైసీపీకి చెడ్డ పేరు తీసుకొస్తోంది. ఇదే విషయాన్ని సర్వే కూడా తెలియజేస్తోంది.
కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 120 సీట్లు వైసీపీ గెలుస్తోందని చెబుతోంది. అందుకే సీఎం జగన్.. చంద్రబాబు అరెస్ట్ చేసేందుకు మొగ్గు చూపి ఉంటారు. కానీ పరిస్థితి క్రమంగా మారిపోతుంది.