TDP, Janasena: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తోందని పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలు బయట ప్రకటించారు. దీనిపై అధికార వైసీపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. తొలుత వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది. ప్యాకేజీ బంధం బయటపడిందని ట్వీట్ చేసింది. పవన్ రాజమండ్రి జైలుకు వచ్చింది పొత్తును ఖాయం చేసుకోవడానికే.. ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైందని తెలిపారు. నీ మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, నమ్మిన వాళ్లకు భ్రమ తొలగించేశావు.. ఇదీ పొత్తులకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం.. రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ట్వీట్ చేసింది.
ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే వారు ఎవరూ లేరని మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో పవన్ ఎప్పుడో ములాఖత్ అయ్యాడని.. ఇప్పుడు కొత్తగా కావాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస రావు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అనే పేరుకు ఈ రోజు సార్ధకత తీసుకొచ్చాడని కామెంట్ చేశారు.
సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడి హడావిడి ఎక్కువగా ఉందన్నారు. చంద్రబాబుకు తానే వారసుడిని అన్నట్టు పవన్ వ్యవహరిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. రాజమండ్రి జైలుకు వచ్చి చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్.. పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఎందుకు పరామర్శించలేదని అడిగారు. యువతను మోసం చేసి రూ.241 కోట్ల అవినీతికి పాల్పడింది చంద్రబాబు అని.. అతని పీఏ స్టేట్ మెంట్, ఈడీ విచారణ, అరెస్ట్ గురించి తెలుసు ఎందుకు మాట్లాడుతున్నావ్ అని నిలదీశారు.
ఇక పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదగలేరు. వచ్చే ఎన్నికలు చివరీవి కానున్నాయి. పవన్‌కు ఒకరితో పెళ్లి మరొకరితో కాపురం కొత్తెమీ కాదు కదా అడిగారు. ప్యాకేజీ కోసమే పార్టీ ఏర్పాటు చేశారు. 25, 35 సీట్లకు అమ్ముడుబోయే పవనా.. తనకు బెదిరించేదని అడిగారు. టీడీపీ, జనసేన కలిసి వచ్చినప్పటికీ.. 175 చోట్ల వైసీపీ విజయం సాధిస్తోందని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు.