»Ycp Comments On Pawan Kalyan Varahi Start The Chittoor
Varahi: వైసీపీ కామెంట్స్.. జనసేన వారాహి అప్ డేట్
నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకులు తెగ ట్రోల్ చేసిన...వారాహి వెహికిల్ రోడ్డెక్కనుంది. అసలు వారాహికి ఏమైందని గట్టిగానే ట్రోల్ చేసింది అధికార వైసీపీ. సడెన్గా రోడ్డెక్కుతుందని జనసేన నాయకులు చెప్పడం ఇప్పుడు అధికార వైసీపీకి మింగుడు పడటం లేదు. రెండు మూడ్రోజుల నుంచి.... తెగ ప్రెస్ మీట్లు పెడుతున్న పవన్.....పొత్తులుంటాయని కరాకండీగా చెప్పేసారు. ఈ నేపధ్యంలోనే..వేర్ ఈజ్ వారాహి అంటూ తెగ ట్రోల్ చేశారు. అధికార వైసీపీ నాయకులకు...బీపీ పెంచడం ఎందుకులే అనుకున్నారామో కానీ...వారాహి అప్డేట్ ఇచ్చేశారు. తిరుపతి నుంచి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవుతుందని హింట్ ఇచ్చారు జనసేన నాయకులు. ఏదేమైనా.... ప్రతిపక్షాల కౌంటర్స్ కి.....మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇవ్వడానికి రెడీ అయ్యారు జనసేనాని.
వారాహి….జనసేనాని ఎన్నికల ప్రచారం కోసం ఎంతో ఇష్టపడి చేయించుకున్న వాహనం..! గతంలో ఎన్టీఆర్ కు చైతన్య రథం ఎలా ఉండేదో… అదే స్టైల్లో తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టారు పవన్. దీని తయారీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనం కలర్ నుంచీ… కొండగట్టు వద్ద పూజల వరకు… అంతా సంచలనమే..! వారాహి పేరు వింటేనే…అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటూ సటైర్లు వేస్తుండేవారు జన సైనికులు. ఇన్నాళ్ల నిరీక్షణ మరి కొద్ది రోజుల్లోనే….సాకారం అవ్వబోతోంది. ఎంతో ఇష్టపడి చేయించుకున్న వాహనం మీద..ప్రచారం చేయాలని పవన్ కి మాత్రం ఎందుకు ఉండదు చెప్పండి.. కానీ సరైన టైమ్ కోసం వెయిట్ చేశారంతే.
ఆరంభంలో అదరగొట్టేసిన వారాహికి ఇప్పుడు ఏమైందన్నది. అందరికీ వచ్చిన సందేహం. వారాహి ఎక్కి… విజయవాడ నుంచి బందర్ వెళ్తారని ప్రకటించారు. దీంతో వారాహి భోణీ…బందర్ ఆవిర్బావ సభే అని భావించారంతా..! ఆ రూమర్స్ అన్నింటినీ… పక్కన పెట్టేసి… తిరుపతి నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని ప్రకటించారు. దీంతో జనసైనికులకు కొత్త ఉత్సాహం వచ్టినట్టు అయింది. వాస్తవానికి వారాహి ఎప్పుడో రెడీ అవ్వాల్సి ఉంది. కానీ పవన్ కి ఓవైపు పొత్తులు.. మరోవైపు సినిమాలు ఉండటం వల్ల.. వారాహి యాత్ర లేట్ అయిందనే చెప్పాలి. అదిగో షెడ్యూల్… ఇదిగో షెడ్యూల్… అంటూ కాలం వెళ్లగదీస్తున్నారే తప్పా…. వారాహి రోడ్డు ఎక్కిందీ లేదని..ప్రతిపక్షాలు మాత్రం… ఓ రేంజ్ లో ఫైర్ అయితున్నాయ్.
పవన్ కళ్యాణ్ దాని మీదెక్కి… ప్రచారానికి ఎప్పుడు వస్తారన్న చర్చ.. కేవలం జనసైనికుల్లోనే కాదు. అటు అన్ని రాజకీయ పార్టీల్లో జరుగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పవన్ వారాహీ మీద ప్రచారం చేస్తే… పరిస్తితి పూనకాలు లోడింగ్ అన్నట్టు ఉంటుదని… అసలు లోడ్ అయ్యేది ఎప్పుడని… ఆశగా ఎదురు చూస్తున్న పవన్ భక్తులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారాహి వాహనం ఆర్ధిక భారం తప్పా.. వీసంత ఉపయోగం కూడా లేదని… పవన్ దాని మీదెక్కి ప్రయాణాలు చేసేది కలలేనని.. ప్రత్యర్ధి వైసీపీ నుంచి గట్టి సటైర్లే పడుతున్నాయ్. ఇలాంటి సందర్భంలో…. వారాహిని క్యాష్ చేసుకోవాలనుకున్న అధికార వైసీపీ…. లోకేశ్ యువగళాన్ని సక్సెస్ చేయడం కోసమే… పవన్ తన వారాహిని వాయిదా వేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా చేసింది. ఇన్ని ఆరోపణల నేపధ్యంలో…. జనసేనాని నుంచి సరైన సమాథానం వచ్చింది.
ఇదిలా ఉంటే, కొన్ని కారణాల వల్ల యాత్ర ప్రారంభం ఆగిపోయి ఉండొచ్చనే వార్తలు… అప్పట్లో ప్రధానంగా వినిపించాయ్. ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. నిజానికి అప్పట్లో పోల్ కోడ్ లేకపోవడంతో… పూజలు చేసిన వెంటనే వారాహిని రోడ్డుపైకి తీసుకురావాల్సి ఉంది. అప్పుడంటే…ఎన్నికల కోడ్ ఉందిలే..ఇప్పుడెందుకు రోడ్డుమీదకు తీసుకురావట్లేదని… చర్చలు జరిగిన నేపధ్యంలో… లోకేశ్ యాత్రను తెరపైకి తీసుకొచ్చారు వైసీపీ నేతలు. జనసేన-టీడీపీకి పొత్తు ఉంది కాబట్టే… పవన్ కళ్యాణ్ వారాహిని లేట్ గా రోడ్ పైకి తీసుకొస్తున్నారనే వాదనలూ లేకపోలేవు. ఇలాంటి ఆరోపణలు ఎన్నో రోజుల నుంచి వస్తున్నప్పటికీ.. ఆయన మాత్రం నోరు తెరవలేదు.
అలాంటప్పుడు యాత్ర ఆలస్యమవడానికి కారణం.. బీజేపీ పెద్దలు పవన్ ను దీక్షకు దిగకుండా అడ్డుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయ్. వాస్తవానికి చెప్పాలంటే… బీజేపీతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలో పవన్ లేరు. ఎందుకంటే…ఈ మధ్యే..చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లిన పవన్… బీజేపీ పెద్దలకు తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను వివరించారు. ఆ తర్వాత….. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టిన పవన్…. పొత్తులు అయితే ఉంటాయని తేల్చేసారు. ఇలాంటి నేపధ్యంలో…ఇంకా ఎలాగూ… పొత్తులుంటాయన్నది ఖాయం అయిపోయింది కాబట్టి… వారాహి స్టార్ట్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చేసారు. ఇక్కడ వరకు బానే ఉంది… కానీ ఎందుకు చిత్తూరు నుంచే మొదలు పెడుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో వాహనాన్ని నిలిపి ఉంచారని ప్రజలు చెబుతుండగా.. అక్కడ కూడా అది కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ఐతే…. పొత్తులుంటాయని పవనే చెప్పేసారు కాబట్టి…. వారాహి స్టార్ట్ చేసేస్తున్నారు. సో… ఎట్టకేలకు వారాహి స్టార్ట్ అవుతుంది కాబట్టి….ఇకపై పవన్ ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలో వేచి చూడాల్సిందే.