ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు..ఆరుగురు మహిళలు మృతి, మరో నలుగురికి గాయాలు
కాకినాడ తాళ్లరేవు బైపాస్ రోడ్డు దగ్గర ప్రమాదం
తాళ్లరేవు మండలం సీతారామపురంలోని సుబ్బరాయునిదిబ్బ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది
రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు
మృతులు యానాంలోని నీలపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.