మాజీ మంత్రి వివేకా హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సునీల్ తండ్రి క్యాన్సర్‌తో మృతి చెందారు. తండ్రి అంతిమ కార్యక్రమాలకు హాజరుకావాలని, తనకు బెయిల్ ఇవ్వాలని సునీల్ యాదవ్ తరపున హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. నాలుగు రోజుల పాటు (10,1117,18) అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సునీల్ వెంట ఎస్కార్ట్ వెళ్లాలని.. వాళ్లకు అయ్యే ఖర్చులకు ఆయనే భరించాలని సూచించింది. ఇక సునీల్ యాదవ్ (Sunil Yadav) బెయిల్ ముగియగానే కోర్టులో లొంగిపోవాలని ఆదేశించారు.
మరోవైపు పూర్తి స్థాయి బెయిల్‌పై విచారణ పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. చంచల్‌గూడ (Chanchalguda) జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్ మధ్యంతర బెయిల్ గడువు ముగియగానే కోర్టులో లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి బెయిల్ ఇవ్వాలంటూ సునీల్ యాదవ్ గతంలో దాఖలుచేసిన పిటిషన్‌పై ఇవాళ వాదనలు జరిగాయి. దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని నిందితుడి తరఫు న్యాయవాది (Lawyer) కోరగా.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున జైల్లోనే ఉంచాలని సీబీఐ వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.