దేశంలో పలు స్థానాలకు జరిగిన ఉపఎన్నిక (byelection)ల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు త్రిపుర, కేరళలో జరిగిన ఉపఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపుర(Tripura)లోని సెపాహిజాలా జిల్లాలోని ధన్పూర్, బోక్సానగర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని ఎన్నికల సంఘం పెర్కోన్నాది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన బైపోల్లో 2 చోట్ల గెలిచిన బిజేపీ (BJP) మరో 3 చోట్ల అధిక్యంలో ఉంది. త్రిపురలోని బాక్సానగర్(Boxanagar),ధన్పూర్ నియోజకవర్గాలను బిజేపీ కైవసం చేసుకుంది. కేరళలోని పూత్తుపల్లి స్థానంలో కాంగ్రెస్ గెలిచింది.
కేరళ పూత్తుపల్లి (Poothupally) ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మరణంతో పూత్తుపల్లి నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానికి రికార్డు స్థాయిలో 53 ఏళ్లపాటు చాందీ ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తరపున ఊమెన్ కుమారుడు చాందీ ఊమెన్ (Chandi Oomen) బరిలోకి దిగారు. తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కంచుకోట అయిన పూత్తుపల్లికి జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు చాందీ ఊమెన్ ఘన విజయం సాధించారు. చాందీ ఊమెన్ తన సమీప ఎల్డీఎఫ్ (LDF) అభ్యర్థిపై 36వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.