హైదరాబాద్ (Hyderabad) రీజియన్ పరిధిలోని జైల్లో ఖైదీలకు చికెన్(Chicken), మటన్‌ను అధికారులు బంద్ చేశారు. ఖైదీలకు 2 వారాలుగా మాంసాహారం (non-vegetarian)వడ్డించడంలేదు. .సరఫరా చేసే కాంట్రాక్టర్(Contractor)కు సుమారు రూ.2 కోట్ల వరకూ బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతోనే మాంసాహార సరఫరాను బంద్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఖైదీలకు తొలి ఆదివారం మటన్ (Mutton) మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. నిధుల కొరతతో నేరస్తుల కడుపు మాడుస్తున్నారని ఖైదీలు (Prisoners) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైళ్లకు మటన్ సప్లై చేసే కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం బకాయి పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. డబ్బులు రెండు కోట్ల రూపాయలకు పైగా బకాయి ఉండటంతో ఆ కాంట్రాక్టు దారులు.. మటన్, చికెన్ సప్లై నిలుపుదల చేశారు. దీంతో ఖైదీలకు పప్పు, సాంబార్ భోజనం(Sambar meal)తో సరిపెడుతున్నారు.