ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ షర్మిల(YS Sharmila)ను సీబీఐ(CBI) సాక్షిగా పేర్కొంది. షర్మిలను 259వ సాక్షిగా సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంటూ వాంగ్మూలం సమర్పించింది. గత సంవత్సరం అక్టోబర్ 7న షర్మిల సీబీఐకి వాగ్మూలం ఇచ్చింది. తన వద్ద ఆధారాలు లేవని, రాజకీయ కారణాల నేపథ్యంలోనే హత్య జరిగిందని ఆమె అన్నారు. హత్యకు కుటుంబ, ఆర్థిక కారణాలు పెద్ద కారణాలు కాదని ఆమె వెల్లడించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాన్ని వైఎస్ షర్మిల తన ప్రకటనలో ప్రస్తావించారు. కడప ఎంపీ సీటు ఎవరికి దక్కాలనే విషయంలో తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అన్నారు.
మరోవైపు వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడికి రక్షణ కల్పిస్తున్నట్లు సొంత అక్కే స్పష్టం చేసిన తర్వాత.. ఎవరు అలా చేస్తున్నారని చంద్రబాబు(chandrababu) ప్రశ్నించారు. సస్పెండ్ అయిన సీఐ శంకరయ్యకు ఎవరు పదోన్నతి కల్పించారని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము సీఎం జగన్‌కు ఉందా అంటూ అప్పట్లో ప్రశ్నించారు.