ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంయుక్త మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టోలో 11 అంశాలను చేర్చనున్నట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు. వాటిలో టీడీపీ నుంచి 6, జనసేన నుంచి 5 ప్రతిపాదనలు స్వీకరించారు.
TDP and Janasena manifesto with 11 points they are these points
ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిపేందుకు టీడీపీ(TDP)-జనసేన(janasena) కూటమి నేతలు ఈరోజు భేటీ అయిన సమావేశం ముగిసింది. ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధి ఏజెండాగా మేనిఫెస్టో రూపొందించాలని కమిటీ నిర్ణయించింది. అందుకోసం టీడీపీ ప్రతిపాదించిన ఆరు అంశాలు, జనసేన పార్టీ నుంచి ఐదు అంశాలను చేర్చుతున్నట్లు కమిటీ నేతలు ప్రకటించారు. మొత్తం 11 అంశాలతో కూడిన ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్బాబు, కొమ్మారెడ్డి పట్టాభి రాం..జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలపై చర్చించేందుకు పాల్గొన్నారు.
బీసీలకు రక్షణ చట్టం, అమరావతి రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక,, కార్మిక సంక్షేమం, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహాకాలు, రద్దు చేసిన సంక్షేమ పథాకాలపై పున పరిశీలన, అసమానతలు తొలిగిపోయి ఆర్థిక వ్యవస్థ బాగుపడే విధంగా ప్రణాళికల రూపకల్పన, సూక్ష్మ, చిన్న తరహా అంకుర సంస్థల ఏర్పాటుకూ రూ.10 లక్షల వరకు రాయితీ వంటి అంశాలను మేనిఫెస్టో(manifesto)లో చేర్చారు.
మరోవైపు వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకుని పూర్తి స్థాయి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తెలుగుదేశం – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పించే పథకాల ద్వారా యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే అంశాలను మినీ మేనిఫెస్టోలో ప్రతిపాదించామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని నేతలు(leaders) ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ-జనసేన కూటమి దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఇరు పార్టీలు..ఈ నేపథ్యంలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండు పార్టీలను సమన్వయం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని, ప్రజలకు వాగ్దానాల రూపకల్పనకు జాయింట్ మేనిఫెస్టో కమిటీని ఇటీవలే ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన టీడీపీ, జనసేన కూటమి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన ప్రజాకూటమి సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగింది. దీపావళి తర్వాత 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ, జనసేనలు నిర్ణయించాయి.