వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది. ఆమె అరెస్టు పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని అన్నారు.
అయితే ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం కరెక్ట్ కాదని అన్నారు. ఈ అంశం మీద మేం మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. నిజానికి ఏపీ అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండగా ఆయనతో విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారనే ప్రచారం ఉంది. గతంలో ఆ పార్టీకి తమ మద్దతు లేదని కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు.