Sajjala Ramakrishna Reddy:వచ్చే ఎన్నికలు- పొత్తులు.. సీఎం పదవీపై జనసేనాని పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన కామెంట్లపై వైసీపీ ముఖ్య నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. పవన్ (pawan) ఇమేజీ అనేది నీటి బుడగ అని కొట్టిపారేశారు. రియాల్టీలో అంతలేదని.. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ ఎజెండా చంద్రబాబు (chandrababu) పల్లకీ మోయడమేనని చెప్పారు. ఈ రోజు చేసిన కామెంట్లతో తనకు బలం లేదని పవన్ కల్యాణ్ అంగీకరించారని పేర్కొన్నారు.
పవన్ పదే పదే టార్గెట్ వైసీపీ అంటున్నారని.. గత 14 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని అడిగారు. పవన్‌కు ఇమేజ్ ఉంది అని.. ఓటు బ్యాంక్ ఉందని ఎల్లో మీడియా క్రియేట్ చేసిన బజ్ అని చెప్పారు. బీజేపీని ఒప్పించడం, టీడీపీతో కలిసి నడవడం మీద పవన్ (pawan) దృష్టి సారించారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ను ఆయన అభిమానులు సీఎం కావాలని అనుకుంటున్నారని.. వారి కలను బాబు వద్ద తాకట్టు పెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)ఆరోపించారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ (pawan kalyan).. కమ్యునిస్టులతో కలిసి పనిచేసే పరిస్థితి లేదని చెప్పారు. కమ్యునిస్టులతో బీజేపీ కలిసి పనిచేయలేని సిచుయేషన్ అని వివరించారు. వైసీపీ వ్యతిరేక పార్టీని చీలనివ్వమని మరోసారి స్పష్టంచేశారు. జనసేనకు 7 శాతం ఓట్లు సాధించిందని గుర్తుచేశారు. బలం ఉన్న చోట 18, 20, 30 శాతం ఓటు ఉందని తెలిపారు. రాయలసీమలో తమ పార్టీకి పట్టులేదన్నారు. తమ ఎన్నికల్లో తమ పార్టీ 137 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామని వివరించారు. 30-40 సీట్లు గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపారు. కర్ణాటకలో కుమారస్వామి (kumaraswamy) సీఎం పదవీ చేపట్టిన అంశాన్ని గుర్తుచేశారు.