Pawan Kalyan:రైతులపై మంత్రి మాటలు బాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ రోజు ఆయన మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు నష్టపోయిన ధాన్యం గింజ ప్రభుత్వం కొనుగోలే చేసే వరకు అండగా నిలిచి పోరాడతామని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. విపక్షాలు గళం విప్పితే తప్ప ప్రభుత్వం చలనం లేదన్నారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తుంటే కొనుగోళ్ల పేరుతో హడావిడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇప్పటివరకు లేని గోనె సంచలు.. రాత్రికి రాత్రే తెప్పించారని పేర్కొన్నారు. దీంతోపాటు దళారీ వ్యవస్థతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. పుట్టగానే సంపూర్ణ జ్ఞానంతో జన్మించారని మంత్రులపై పవన్ కల్యాణ్ ఫైరయ్యారు.
రైతు సమస్యలు వినేందుకు రాజమహేంద్రవరంలో కార్యాలయం ప్రారంభిస్తున్నామని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. రైతులకు సకాలంలో డబ్బులు వేయలేదని పేర్కొన్నారు. పంట నష్టానికి సంబంధించి వాస్తవ నివేదికను సీఎం జగన్ తెప్పించుకోలేదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయమని ఆందోళనకు దిగిన రైతులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. అన్నదాతలను వేధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు.
ఎన్నికల్లో పొత్తు గురించి మీడియా ప్రతినిధులు అడగగా.. కమ్యునిస్టులతో కలిసి పనిచేసే పరిస్థితి లేదని చెప్పారు. కమ్యునిస్టులతో బీజేపీ కలిసి పనిచేయలేని సిచుయేషన్ అని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ కూడా పొత్తులతోనే బలపడ్డాయని పేర్కొన్నారు. ఉనికి చాటుచెప్పేందుకు రాజకీయ పార్టీ పెట్టలేదని అన్నారు. వైసీపీ వ్యతిరేక పార్టీని చీలనివ్వమని మరోసారి స్పష్టంచేశారు. జనసేనకు 7 శాతం ఓట్లు సాధించిందని గుర్తుచేశారు. బలం ఉన్న చోట 18, 20, 30 శాతం ఓటు ఉందని తెలిపారు. రాయలసీమలో తమ పార్టీకి పట్టులేదన్నారు. తమ ఎన్నికల్లో తమ పార్టీ 137 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామని వివరించారు. 30-40 సీట్లు గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపారు. కర్ణాటకలో కుమారస్వామి సీఎం పదవీ చేపట్టిన సందర్భాన్ని ఉదహరించారు.
ముందస్తు ఎన్నికలు వస్తే.. జూన్ నుంచి ప్రజల్లోకి వెళతాం అని వివరించారు. గౌరవానికి భంగం వాటిల్లకుంటే పొత్తులతోనే ముందుకు వెళతాం అని పేర్కొన్నారు. వైసీపీ దాష్టికానికి ఎదుర్కొంటామని పవన్ స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్ బలోపేతం కోసం పనిచేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి పదవీ తానే వరించాలి తప్ప.. వెంపర్లాడబోమని తేల్చిచెప్పారు. బలం చూపించి సీఎం పదవీ అడగాలి తప్పే.. మరొకటి కాదన్నారు. టీడీపీ అధ్యక్షుడిని తనకు సీఎం పదవీ ఇవ్వాలని అడగనని.. అలాగే బీజేపీ అధ్యక్షుడిని కూడా అడగనని వివరించారు.