»Posani Krishna Murali Sensational Comments On Caste Politics In Ap
Posani Krishna Murali: మన కులపోడైనా..మోసగాడిని సీఎం చేయొద్దు
మన కులం వాడైనా వంద మంది మంచి లక్షణాలు ఉంటేనే మన కూతురిని ఇస్తాం. మోసగాడు, చెడ్డవాడైనా పర్లేదు.. మన కులం వాడినే సీఎం చేద్దామనుకోవడం నా కులం వాళ్లకు తగునా? ఇదేమీ మానవత్వం? అని ప్రశ్నించారు.
నటుడు, దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali). అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల (Politics) కంపులో మునిగి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా ప్రత్యర్థులను విమర్శిస్తున్నారు. బండ బూతులే ఒకటే తక్కువ అన్నట్టు ఆయన మాటలు ఉంటున్నాయి. ఇటీవల నంది అవార్డుల (Nandi Awards) విషయమై ఓ నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని తాజాగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన కులపోడు మోసగాడైనా ముఖ్యమంత్రిని (CM) చేయాలా? అంటూ ప్రశ్నించారు. విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన పోసాని విద్యార్థుల ఎదుట జుగుస్పకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో (Acharya Nagarjuna University- ANU) సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి సినిమా అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసీ) చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుల రాజకీయాలపై (Caste Politics) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని (Nara Chandrababu Naidu) పరోక్షంగా ప్రస్తావిస్తూ అతడు ప్రసంగించారు. సభలో చేసిన ప్రసంగం ఇలా ఉంది.. ‘మన కులం వాడైనా వంద మంది మంచి లక్షణాలు ఉంటేనే మన కూతురిని ఇస్తాం. మోసగాడు, చెడ్డవాడైనా పర్లేదు.. మన కులం వాడినే సీఎం చేద్దామనుకోవడం నా కులం వాళ్లకు తగునా? ఇదేమీ మానవత్వం’ అని ప్రశ్నించారు. ‘మన కులం వాడు అని రాష్ట్ర భవిష్యత్ ను మోసగాడి చేతిలో పెడతామా? అని నిలదీశారు. ‘నాలో మనిషి లక్షణాలు ఉన్నాయి. నా కూతురి విషయంలోనైనా.. రాష్ట్ర భవిష్యత్ విషయంలోనైనా ఒకే రకంగా ఉంటాయి. మన కులపోడు అని వెన్నుపోటు రాజకీయాలను అంగీకరించను. నేను తప్పునకు తల వంచను’ అని తెలిపారు.
‘ప్రతి వ్యక్తికి అతడి కులం అంటే అభిమానం (Affection) ఉండటంలో తప్పు లేదు. కానీ ఆ అభిమానం రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసేదిగా ఉండొద్దు’ అని పోసాని కోరారు. ‘ద్రోహులే కులతత్వాన్ని (Casteism) రూపొందించి పెంచి పోషిస్తున్నారు. కులతత్వాన్ని, వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహించడం మానవత్వం కాదు. ఏ తప్పు చేయకుండా మీరు మీలా ఉంటే చాలు.. అందరూ గాంధీలు, దేవుళ్లు అయితే దేశం ఏమైపోవాలి?’ అని కృష్ణ మురళి పేర్కొన్నారు.