Posani Krishna Murali: చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మోసాలకు పెట్టింది పేరు అని విరుచుకుపడ్డారు. సీఎం జగన్ (jagan) కాలి గోటికి చంద్రబాబు (chandrababu) సరిపోరని కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) కూడా పోసాని తనదైన శైలిలో విమర్శలు చేశారు. పవన్ లాంటి రాజకీయ నేతను చూడలేదని పేర్కొన్నారు.
పవన్ కాపు అయి ఉండి చంద్రబాబుకు (chandrababu) భజన ఎందుకు చేస్తున్నారని పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) అన్నారు. లోకేశ్‌కు తినడమే తెలుసు అని.. ఆయన తినడం పైనుంచి ఎన్టీఆర్ చూసి, చూసి విసుగు చెంది ఉంటారని వివరించారు. ఆ తర్వాత యాత్రకు బయల్దేరారని గుర్తుచేశారు. చివరకు లోకేశ్ చెంతన పవన్ కల్యాణ్ (pawan kalyan) చేరారని తెలిపారు. కాపులు ఎంత గొప్పవారో తెలియజేసే మూవీ తాను తీశానని పోసాని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి ఓడిపోయిన ఫర్లేదు కానీ.. చంద్రబాబు మాత్రం సీఎం కావాలని అనుకుంటారని గుర్తుచేశారు. మీడియా బ్యారన్ రామోజీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణపై కూడా విరుచుకుపడ్డారు.