»Posani Krishna Murali Posanis Interesting Comments On Ramoji
Ramoji Raoపై పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీఎఫ్డీసీ పోసాని కృష్ణమురళి రామోజీరావుపై మండిపడ్డారు. కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు మాత్రమే సీఎం కావాలని రామోజీరావుకి కోరిక ఉందని పోసాని ఎద్దేవా చేశారు.
Ramoji Rao: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండకూడదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలనే రామోజీరావు కోరిక అంశంపై ఏపీఎఫ్డీసీ పోసాని కృష్ణమురళి ఆరోపణలు చేశారు. సీఎం జగన్ అంటే రామోజీకి ద్వేషమని పోసాని ఆయనపై మండిపడ్డారు. విద్యార్థులు చదువుకోవడానికి ట్యాబ్‌లు ఇస్తే వాళ్లు వీడియోలు చూస్తున్నారని రామోజీరావు అన్నారని పోసాని మండిపడ్డారు. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్. పిచ్చిగా అసత్య కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు కడుపున పుట్టడం పెద్ద శాపమని అతని కుమారుడు సుమన్ తనతో అన్నాడని పోసాని పేర్కొన్నారు.
లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు పిచ్చిరాతలు రాశారని ఆయన మండిపడ్డారు. కమ్మ సామాజిక వర్గంలో కేవలం చంద్రబాబు మాత్రమే సీఎం కావాలని రామోజీరావు కోరుకుంటున్నారని పోసాని పేర్కొన్నారు. ట్యాబ్‌లో కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇంకా ఏవి ఓపెన్ కాకుండా లాక్ ఉంటుందని పోసాని తెలిపారు. 1985లో సికింద్రాబాద్ మార్గదర్శిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాను. అప్పుడు రామోజీ చాలా నిజాయితీపరుడని అనుకున్నాను. కానీ రామోజీరావు పేదల డబ్బును దోచుకున్నారని మండిపడ్డారు.