KNR: సైదాపూర్ మండలంలోని విశాల సహకార పరపతి సంఘం నూతన భవన నిర్మాణ పనులను, జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య ఈరోజు పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి, భవనాన్ని సభ్యులకు అందుబాటులోకి తేవాలని ఆయన సంఘ కార్యదర్శిని ఆదేశించారు. సంఘం రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, సభ్యులకు అందుతున్న సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు.