చంద్రబాబు అవినీతిని సీనియర్ ఎన్టీఆర్ బయటపెట్టారని పోసాని గుర్తుచేశారు. బాబు కరప్షన్ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ కూడా చెప్పారని వివిరించారు. పదవీ కోసం ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోడీయే చెప్పారని వివరించారు. ఈ విషయం పురంధేశ్వరికి తెలియదా..? అని అడిగారు. మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ అమలు చేస్తే.. చంద్రబాబు ఎత్తివేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో పురందేశ్వరి ఎందుకు నిలదీయలేదని అడిగారు. ఎన్టీఆర్ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీలో చేరతారా అని నిలదీశారు. పార్టీలు మారే మీరు సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదన్నారు.
స్కిల్ స్కామ్లో చంద్రబాబును కక్షతో అరెస్ట్ చేశారని చెబుతున్నారు. కొన్ని జిల్లాలు తిరిగానని తెలిపారు. మరీ చంద్రబాబు ఎంత దుర్మార్గుడో ముగ్గురు చెప్పారుగా అని వీడియోలు చూపించారు. బాలకృష్ణకు సంబంధించి కేసు విషయంలో పురందేశ్వరి ఏం చేశారో వివరించారు. మీ తమ్ముడికో న్యాయం.. మిగతా వారికి మరో న్యాయమా అని అడిగారు. పురందేశ్వరికీ బీజేపీపై కాస్త కూడా ప్రేమ లేదని.. అధికారం కోసమే అందులో చేరారని వివరించారు.