»Today Is The 10th Anniversary Of Jagan Bail Nara Lokesh Happy 10th Anniversary Jagan Tweet Viral
Happy10thBailAnniversaryJagan: నేడు జగన్ బెయిల్ 10వ వార్షికోత్సవం..ట్విట్టర్లో ట్రెండింగ్
నేటితో జగన్కు బెయిల్ వచ్చి సరిగ్గా పదేళ్లు పూర్తైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు 30కిపైగా కేసులు ఉన్న జైలు మోహన్ సీఎంగా ఉన్నారని, జనాల్లో ఉండాల్సిన చంద్రబాబు జైలులో ఉన్నారని కామెంట్స్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
Today is the 10th anniversary of Jagan bail nara lokesh tweet viral
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి నేటికి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2013 సెప్టెంబర్ 23వ తేదీన జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం 30కిపైగా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 12 ఛార్జీ షీట్ల తర్వాత సీబీఐ, తొమ్మిది ఈడీ విచారణలకు దారి తీసి జైలుశిక్ష అనుభవించి సీబీఐ కోర్టు నుంచి ఆయన బెయిల్ పొంది విడుదలయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆ రోజును గుర్తు చేస్తు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh)#Happy10thBailAnniversaryJagan అంటూ ఓ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్లో బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42 వేల కోట్ల రూయల ప్రజాధనం దోచేసి, సీబీఐ(cbi)-ఈడీ(ED) పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్.. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు అసలు జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్(chandrababu naidu) జైలులో ఉన్నారని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రైండ్ అవుతుంది. ఎక్స్ లో ఏకంగా ఈ అంశం గురించి టాప్ 2లో Happy10thBailAnniversaryJagan హ్యాష్ ట్యాగ్ కొనసాగుతుంది.
2014 నుంచి జగన్ ప్రతి శుక్రవారం కోర్టు విచారణలకు హాజరవుతున్నారు. అయితే ఈ కేసుల సంక్లిష్ట స్వభావం కారణంగా ఈ కేసులకు సంబంధించిన వివిధ పక్షాలు బహుళ డిశ్చార్జ్ పిటిషన్లను దాఖలు చేయడం, సీబీఐ కేసులు పరిష్కరించబడిన తర్వాత మాత్రమే ఈడీ కేసులను కొనసాగించాలని కోర్టును నెట్టడం ద్వారా విచారణలు ఆలస్యం అయ్యాయి. కానీ 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా దాదాపు 250 శుక్రవారాలు జగన్ కనీసం పది శుక్రవారాలు కూడా కోర్టుకు వెళ్లకుండా ఏదో ఒక కారణంతో గైర్హాజరు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఇది ప్రాథమిక బెయిల్ షరతును ఉల్లంఘించినప్పటికీ చట్టపరమైన ప్రక్రియకు సహకరించడం, కోర్టు ఎప్పుడూ అభ్యంతరం తీసుకోలేదు. ఈ కేసులు 2014లో ఉన్నాయని, కేసులను నెమ్మదించేందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వంతో జగన్ డీల్ కుదుర్చుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.