విశాఖనగరం ఉత్తర నియోజికవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎండగట్టారు. రూ. 5 ఇస్తే ఏదైనా చేసే పేటీఎమ్ బ్యాచ్ ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan's Hello AP.. Bye Bye YCP slogan should be adhered Nara Lokesh
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విశాఖనగరం ఉత్తర నియోజికవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఏపీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రాకు పట్టిన దరిద్రమే జగన్ అని, ప్రశాంతంగా ఉన్న విశాఖను విషాదంగా మార్చింది వైసీపీ నేతలు అని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని అనారోగ్యశ్రీగా మార్చాడని, సంపూర్ణ మద్యం నిషేదం అని కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాడు అని, నవరత్నాల పేరుతో నవమోసాలు చేశాడని ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇంకో రెండు నెలల సమయం మాత్రమే ఉందని, వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
టీడీపీ జనసేన మధ్య చిచ్చుపెట్టాలని వైఎస్ జగన్ కుట్రపన్నుతున్నాడు. రూ. 5 ఇస్తే ఏదైనా చేసే పేటీఎమ్ బ్యాచ్ ఉందని ప్రజలను ఉద్దేశించి జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఇక పవన్ కల్యాణ్ చెప్పిన హల్లో ఏపీ, బైబై వైసీపీ అనే స్లోగన్ మర్చిపోవద్దు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి అన్యాయంగా, అక్రమంగా టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిన వారి పేర్లను రెడ్ బుక్లో రాశామని, ఎవరినీ వదలము అని అన్నారు.