Pawan Kalyan: పొత్తుల కోసం.. ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలను (Pawan meet BJP leaders) కలిశారు. నేడు మధ్యాహ్నం బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్, కేంద్రమంత్రి మురళీధర రావుతో (BJP Muralidhar Rao) జనసేనానితో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తదితరులు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు జనసేన, బీజేపీ కార్యాచరణ పైన భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందని ఏపీ బీజేపీ నేతలు (Andhra Pradesh BJP leaders) ఇటీవల బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలతో పవన్ (Pawan Kalyan) భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలనేది పవన్ ఆలోచన. ఇందుకోసం ఆయన మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీకి ఆసక్తి లేదు. కానీ కూటమిలో టీడీపీ లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. ఈ ఆలోచనతోనే పార్టీలను ఏకతాటి పైకి తీసుకు వచ్చేందుకు పవన్ పని చేస్తున్నారు.
పవన్ ఢిల్లీ పర్యటన (Pawan Kalyan Delhi Tour) పైన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు (AP BJP chief Somu Veerraju) మధ్యాహ్నం స్పందించారు. ఈ పర్యటన గురించి తమకు తెలియదని చెప్పారు. ఏపీలో జనసేనతో కలిసి వెళ్లినా ఒకటే.. వెళ్లకున్నా ఒకటే అని, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని సోము వీర్రాజు (Somu Veerraju), ఎమ్మెల్సీ మాధవ్ (MLC Madhav) తదితర నేతలు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోను (BJP chief JP Nadda) మాట్లాడేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.