Pawan Kalyan: మరో 8, 9 నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన పనుల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలపై క్యురియాసిటీ నెలకొంది. ముఖ్యంగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బరిలోకి దిగే స్థానంపై చర్చకు దారితీసింది.
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. కనీసం ఒక చోట కూడా గెలవలేని పరిస్థితి.. దీంతో వచ్చే సారి అలా కాకుడదు అనుకుంటున్నారు. కొత్త నియోజకవర్గంలో బరిలోకి దిగుతానని ఇదివరకే స్పష్టంచేశారు. గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఏ నియోజకవర్గమో ఇప్పటివరకు వెల్లడించలేదు.
గత రాత్రి పీఠాపురంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బస చేశారు. వారాహి వాహనంలో యాత్ర చేపడుతోన్న సంగతి తెలిసిందే. ‘ఇక్కడినుంచి వెళ్లాలని లేదు. ఇక్కడే ఉంటా. తనకు అధికారం ఇవ్వండి, ఏం చేయగలనో అధికారం చేపట్టి చూపిస్తా’ అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. త్వరలో పీఠాపురంలో ఆఫీసు ఓపెన్ చేస్తానని వివరించారు.
ప్రస్తుత పరిణామాలు చూస్తే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారని అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గం పేరు చెప్పలేదు.. ఇండైరెక్టుగా ఇండికేషన్స్ ఇచ్చారు. సో.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో పీఠాపురం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.