SKLM: జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జల జీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వేగవంతం చేసి, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు.
కోనసీమ: మండపేట పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తామని మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఇవాళ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ఆసుపత్రి భవనంపై అదనపు నిర్మాణాన్ని మున్సిపల్ సిబ్బంది నేడు కూల్చివేశారు. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రకాశం: కొమరోలు మండలంలోని రేషన్ దుకాణాలను గురువారం తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణంలోని రికార్డులను పరిశీలించి, స్టాక్‌ను సమీక్షించారు. రేషన్ తీసుకునేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరుకులు అందించాలని దుకాణదారులకు సూచించారు. ఈ తనిఖీలలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
VZM: వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంని జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి తన నివాసంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్, కుమార్తె సిరి సహస్ర గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ మేరకు పలు అంశాలపై చర్చించారు. అనంతరం సిరి సహస్రను జగన్ ఆశీర్వాదించారు.
E.G: జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామం రైతు సేవ కేంద్రాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్.నరసింహం పాల్గొని మాట్లాడుతూ.. పంట వేసిన రైతులందరు ఖచ్చితంగా ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని, ఈ-క్రాప్ నమోదుకు ఈనెల ఆఖరు వరకు ఉంటుందని తెలియజేశారు.
SKLM: పాతపట్నంలో కొలువై ఉన్న శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వర రావు గురువారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు.
KDP: విద్యార్థులు అన్నిటిలో ఉత్తమమైన శక్తిని కలిగి ఉండాలని, అప్పుడే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు. గురువారం స్మార్ట్ ఇండియా హ్యకథాన్-2025లో భాగంగా విద్యార్థులు అభివృద్ధి చేసిన వివిధ విభాగాల అప్లికేషన్లు ప్రదర్శించారు. దాదాపు 106 టీమ్లు ప్రదర్శనలు చేయగా.. 50 ఉత్తమ టీమ్లుగా ఎంపిక చేశారు.
SKLM: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మూడవరోజు గురువారం అమ్మవారికి భక్తులు ఘటాల మొక్కుబడి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఘటాల ఉత్సవాలకు డీఎస్పీలు లక్ష్మణరావు, వివేకానంద స్వీయ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏటువంటి అసౌకర్యం, ఆటంకాలు లేకుండా ఘటాల మొక్కుబడి పూర్తయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గం నుంచి 59 మంది డీఎస్సీలో విజయం సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత గురువారం వారికి నియామక పత్రాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,941 మంది డీఎస్సీకి ఎంపికైయ్యారని వారికి ఒకే రోజు ఒకే వేదిక నుంచి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ తమిమ్ అన్సారియా గురువారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పిల్లలు, పశువులను నీటి ప్రవాహాల వద్దకు పంపకూడదని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్08632234014ను సంప్రదించాలన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవ రోజు శ్రీ మధుకైటభవధ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
KKD: గొల్లప్రోలు మండలంలో మిర్చి పంటకు ‘టొబాకో’ వైరస్ రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్త ఎస్‌విఎన్.శర్మ, ఏడీ స్వాతి రైతులకు సూచనలు చేశారు. దీని నివారణకు ఫిప్రోనిల్ 400 ఎంఎల్ లేదా ప్లోనికామిడ్ 60 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.
ELR: పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్‌రాష్ట్ర ముఠాను అదుపులోనికి తీసుకొని, వారు దొంగతనాలకు వినియోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వాహనాల తనిఖీలు చేశారు. పశువుల దొంగతనాల్లో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.
KDP: కమలాపురం మండలం ఆగస్తలింగాయపల్లెలో ఐదు రోజులుగా తాగునీటి కొరత తీవ్రమైంది. దీనిపై గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కొండారెడ్డి నేతృత్వంలో పలువురు మహిళలు అధికారులను కోరుతున్నారు.