KDP: కమలాపురం మండలం ఆగస్తలింగాయపల్లెలో ఐదు రోజులుగా తాగునీటి కొరత తీవ్రమైంది. దీనిపై గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కొండారెడ్డి నేతృత్వంలో పలువురు మహిళలు అధికారులను కోరుతున్నారు.
NLR: కోవూరు మండల వైసీపీ నాయకులు మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ వీరి చలపతిరావు అరెస్ట్‌ను ఖండించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. రాజకీయ కక్షలు పెట్టుకుని ఒకే పార్టీని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికీ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు.
SKLM: పాతపట్నంకి చెందిన డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన 80 మంది అభ్యర్థులకు గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నియామక పత్రాలను విజయవాడలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందనలు తెలుపుతూ, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ప్రభుత్వం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ELR: ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలని భీమడోలు ఎంపీడీవో పద్మావతి దేవి అన్నారు. బుధవారం భీమడోలు మండలం పొలసానిపల్లిలో సచివాలయం వద్ద నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధారం మొబైల్ క్యాంపు పనితీరును ఎంపీడీవో ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, సచివాలయ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
VZM: 2025 మహిళ పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో నిందితుడికి పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.3వేలు జరిమానా విధించారు. అలాగే రూ.2 లక్షలు బాధితురాలికి పరిహారం ఇవ్వాలని తీర్పు వెల్లడించారు. వివరాల మేరకు పట్టణంలోని మెదర వీధికి చెందిన పైడిరాజు ఓ మైనర్ బాలికను స్కూటీపై తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.
VSP: రాయగడ-విజయనగరం మూడవ లైన్ ప్రాజెక్టులో భాగంగా, బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం స్టేషన్ల మధ్య కొత్తగా వేసిన 14 కి.మీ.ల మూడవ రైలు మార్గాన్ని రైల్వే భద్రతా కమిషనర్ బ్రిజేష్ కుమార్ మిశ్రా గురువారం పరిశీలించారు. వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఇతర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు. హై-లెవల్ ప్లాట్‌ఫామ్‌లపై బృందం సమీక్షించింది.
ELR: డిసిసిబి ద్వారా నిర్వహించే అన్ని లావాదేవీలు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు నిబంధనలు మేరకు జరుగుతాయని డిసిసిబి భీమడోలు శాఖ మేనేజర్ ఒబిలిశెట్టి రమేష్ తెలిపారు. MMపురంలో గురువారం డిసిసిబి భీమడోలు శాఖ ఆధ్వర్యంలో రైతులకు, కౌలు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ మేనేజర్ మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాలకు ఆధార అనుసంధానం ఉండాలన్నారు
GNTR: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయంలో దేవీ శరన్నవరాత్రి సందర్భంగా ఆస్థాన మండపంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం రాజ్యలక్ష్మీ అమ్మవారు విజయలక్ష్మీగా భక్తులకు దర్శనమిచ్చారు. కైంకర్య పరులుగా జే. శ్రీధర్, గంగా శంకర్లు వ్యవహరించారు. ఈవో కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
PPM: జిల్లాలో గల అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది ఆదేశించారు. గురువారం పంచాయతీ రాజ్, స్పోర్ట్స్, సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి విద్యార్థి కనీసం మూడు క్రీడలను ఎంపిక చేయాలన్నారు.
KRNL: నందికొట్కూరు రహదారిన చెక్‌పోస్ట్ నుండి ఎస్.ఎస్. గార్డెన్స్ వరకు ఎన్‌హెచ్-340సి రహదారి విస్తరణకు సెంట్రల్ మార్కింగ్ ప్రకారం భూములు కోల్పోనున్న ప్రభావితుల వారీగా సమగ్ర విస్తీర్ణ వివరాలు త్వరగా అందించాలని కమిషనర్ పి.విశ్వనాథ్, ఆర్&బీ శాఖ అధికారులకు సూచించారు. గురువారం ఆయన నగరపాలక కార్యాలయంలో ఆర్&బీ, పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో చర్చించారు.
VZM: అమరావతి సచివాలయ ప్రాంగణంలో మెగా డీఎస్సీ ఉత్సవ్ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నూతన ఉపాధ్యాయులంతా పట్టుదల, కమిట్మెంట్‌తో పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీ నందు గురువారం రాత్రి ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సెక్రటరీ సంపత్, గ్రామ TDP అధ్యక్షులు కీర్తి పూర్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సెక్రటరీ సంపత్ మాట్లాడుతూ.. శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు.
ATP: గుంతకల్లు రైల్వే ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే డీఎస్పీ ఆకాశ్ కుమార్ జైస్వాల్ హాజరయ్యారు. ముందుగా డి.ఎస్.పి రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన 18 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. వారు మాట్లాడుతూ.. రక్తదానంపై అపోహలు వద్దని ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని సూచించారు.
SKLM: విజ్ఞత మరచిపోయి అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడడం సమంజసం కాదని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం నరసన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాటల్లో ఆయన యొక్క విజ్ఞత స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. జగన్ని సైకో గాడు అనడం ఆయనకు సరికాదని ఘాటుగా విమర్శించారు.
VSP: విశాఖ బీచ్ రోడ్డు ఆనుకుని రుషికొండలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (టీటీడీ)లో లడ్డు విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు గురువారం తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.