ATP: అమరావతిలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో ఉద్యోగాలు సాధించిన 755 మందికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం డీఎస్సీ నియామకాన్ని పూర్తి చేసిందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు.
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యంత్ర 2K25 సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా యుసీఐఎల్ డీజీఎం ప్రభాస్ రంజన్, న్యూటెక్ బయోసైన్స్ కంపెనీ జనరల్ మేనేజర్ వసంత్ కుమార్, వైజాగ్ పోర్ట్ అథారిటీ అసిస్టెంట్ సెక్రటరీ అజయ్ తేజలు పాల్గొంటారని చెప్పారు.
KDP: స్మార్ట్ ఇండియా హ్యకథాన్-2025లో భాగంగా ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అభివృద్ధి చేసిన వివిధ విభాగాల అప్లికేషన్లను గురువారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి గుప్తా మాట్లాడుతూ.. విద్యార్థులు అన్నిటిలో ఉత్తమమైన శక్తిని కలిగి ఉండాలని, అప్పుడే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని అన్నారు.
KDP: పులివెందులలోని అంకాలమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆలయ అర్చకులు సురేశ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని మోహిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దర్శనానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
KDP: ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి/ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు, చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ, మైదుకూరులోని వెంకటేశ్వర గర్ల్స్ డిగ్రీ కాలేజీలో హెచ్ఐవి/ఎయిడ్స్ నిర్మూలనపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది హెచ్ఐవి, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన కల్పించారు.
అన్నమయ్య: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని MRO అమర్నాథ్ హెచ్చరించారు. గురువారం కోడూరు మండలం రాఘవరాజపురం పంచాయతీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో సర్వేయర్ బాలసుబ్రమణ్యంతో కలిసి సర్వే నిర్వహించి, ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
KDP: చెన్నూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం TDP కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇంఛార్జ్ సరోజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
KKD: అన్నవరంలో ఆర్ఎంపీ వైద్యునిగా సేవలు అందిస్తున్న పదిలం బెన్నబాబుకు జాతీయ స్థాయిలో ‘పీస్ ఐకాన్’ అవార్డు లభించింది. దశాబ్దాలుగా వైద్య సేవలతో పాటు సామాజిక సేవలు అందిస్తున్నందుకుగాను, గ్లోబల్ పీస్ & కల్చరల్ అసోసియేషన్ ఈ పురస్కారాన్ని అందించింది. కాకినాడ జేఎన్టీయూ వీసీ సీఎస్ఆర్‌కె ప్రసాద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
ప్రకాశం: జిల్లా గిద్దలూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులలో భాగంగా గురువారం అమ్మవారు గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మున్సిపల్ కమిషనర్ రమణబాబు తన కుమారుడితో కలిసి అమ్మవారిని దర్శించుకుని, అర్చకులచే తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కమిషనర్‌ను సన్మానించారు.
SKLM: సోంపేటలోని కొంచాడ రాజేశ్వరరావు డిగ్రీ కళాశాలలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి ఉరిటి సాయికుమార్ వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 300 మందికి పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు.
అన్నమయ్య: గురువారం MSP నేత సుధాకర్ బాబు అధ్యక్షతన పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఐ నేతలు పాల్గొన్నారు. పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు, రోపిచెర్ల, పులిచెర్ల, గుర్రంకొండ, కేవీ పల్లి, యార్రవారి పాల్యం, చిన్న గొట్టిగల్లు మండలాలను కలిపి ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రకాశం: వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడితో పాటు ఇద్దరు వ్యక్తులను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు నిందితులు జల్సాలకు అలవాటు పడి ఇప్పటివరకు 19 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు శ్రీనివాస రావు అన్నారు. కాగా, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు
KDP: జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్, ఎస్పీ విశ్వనాథ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయంతో పాటు పరిహారం అందేలా చూడాలన్నారు.
కోనసీమ: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగింది. సంస్థ డైరెక్టర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 12 మందిని ఎంపిక చేయగా వారంతా సంస్థ ఛైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశేట్టి సుభాష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్‌ల సమక్షంలో డైరెక్టర్‌లుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
కొనసీమ: నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం కొత్తపేట పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.