WG: తణుకుతో పాటు రూరల్ తేతలి, పైడిపర్రు, వేల్పూరు, అత్తిలి, కొమ్మర సబ్ స్టేషన్ల పరిధిలో లైన్లు మరమతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ నరసింహమూర్తి తెలిపారు. తణుకులోని ఇరగవరం కాలనీతోపాటు తేతలి ఇండస్ట్రియల్ ఏరియా, మండపాక, పైడిపర్రు గ్రామాలకు అత్తిలి, ఇరగవరం మండలాల్లో సరఫరా ఉండదన్నారు.
AKP: ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్ధంతి సందర్భంగా ఎలమంచిలిలో ఈనెల 28న సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ఎం రామారావు తెలిపారు. స్థానిక గుర్రప్ప కళ్యాణ మండపంలో సాయంత్రం మూడు గంటలకు సంగీత విభావరి ప్రారంభం అవుతుందన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతాలను పలువురు గాయకులు ఆలపిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
KDP: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం IIIT విద్యార్థులకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు వర్సిటీ యంత్రాంగం దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఆయా క్యాంపసుల నుంచి విద్యార్థులు పండగ సెలవుల కోసం స్వగ్రామాలకు తరలి వెళ్ళనున్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో శుక్రవారం దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఐదవరోజు స్కందమాత అలంకారణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని ప్రత్యేక పూలమాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
సత్యసాయి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి యూరప్ యాత్రకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి బుడాపెస్ట్ దేశంలో పర్యటించారు. డానుబే నది, ముత్యం వంతెనలపై నిలబడి ఫోటోలు దిగారు. ప్రపంచాన్ని అన్వేషించడం అంటే కేవలం ప్రదేశాల గురించి మాత్రమే కాదని, అది మీతో ఎప్పటికీ నిలిచి ఉండే అనుభూతుల గురించి అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
CTR: ప్రతి రైతు ఈ నెలాఖరుకు ఈ-పంటను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురశ్రీకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని ఏఎలప్పురం, కమ్మతిమ్మయ్యపల్లె, గుడిపాల పంచాయతీల్లోని పంటలను పరిశీలించారు. వేరుసెనగ పంటను పరిశీలించి రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ప్రకాశం: ఒంగోలులోని మామిడిపాలెంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజా బాబు గురువారం తనిఖీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోడౌన్‌ను పరిశీలించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం పట్టిష్టమైన భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ధర్మవరం రూరల్ మండలంలోని గరుడంపల్లి గ్రామ సమీపంలో ఎస్సై శ్రీనివాసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.14,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని ఏన్జీఓ హోమ్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నుంచి ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్ ప్రారంభం కానుందని నిర్వాహకులు ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 40 జట్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి, కాగా విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేసి ప్రోత్సహించనున్నట్లు వారు వెల్లడించారు.
ATP: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు శుక్రవారం తాడిపత్రి రానున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాల అమలును పరిశీలించనున్నారు. ముందుగా జమ్మలమడుగు బస్టాండును సందర్శించి తరువాత తాడిపత్రి బస్టాండుకు చేరుకుంటారు. ప్రయాణికులతో మాట్లాడి సంస్థ అందించే సౌకర్యాలపై వివరాలు సేకరించనున్నారు.
అన్నమయ్య: రాయచోటిలోని జిల్లా గణాంకాల ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న పెద్దయ్యకు గురువారం ఉపసంచాలకులుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా సిబ్బంది, కార్యాలయం సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డివిజన్ డీవైఎస్ఓ రామ్మోహన్ నాయక్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించిన ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన పలువురి అభ్యర్థులకు గురువారం రాత్రి MLA రవికుమార్ నియామక పత్రాలు విజయవాడలో అందజేశారు. ఈ మేరకు వారందరినీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారు ప్రభుత్వం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
CTR: మెప్మా ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు పాత మున్సిపల్ కార్యాలయంలో లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మంజునాథ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. పీఎం స్వనిధి కింద కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు రహదారి భద్రత ఉల్లంఘనలపై జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వాహనదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు డ్రైవర్లు సీటు బెల్ట్ తప్పనిసరిగా వాడాలని హెచ్చరించారు. పలువురికి జరిమానా విధించారు.
KDP: మైదుకూరు ప్రాంతంలో రైతులు పసుపు సాగులో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయిని సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటి తడులు అందించడంతో తోటలు ఏపుగా పెరుగుతున్నాయి. మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చాపాడు మండలాల్లో ఈ సాగు విస్తృతంగా చేపట్టారు. ఇక్కడ పండిన పసుపు నాణ్యత వ్యాపారులను ఆకర్షిస్తోంది