KDP: వేంపల్లి మండలలోని కుప్పాలపల్లెలో తాళ్లపల్లి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో నూతన ధ్వజస్తంభ, నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎంపీకి తీర్థ ప్రసాదాలు అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు.
VZM: పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో రోటర్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
VZM: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శనివారం అందజేశారు. అనారోగ్యానికి గురై చికిత్స పొందిన గెంబలి విమల కుమారికి రూ. 4,01,137 పెనుబాక గ్రామానికి చెందిన చీడి జగన్నాథానికి రూ. 2,63,124 చెక్కులను అందబేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపదల ఆరోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిధి నిలుస్తుందన్నారు.
VZM: గరివిడి మండలం వెదుళ్ల వలస గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్బంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా పార్వతీపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ కంచు మోజు రామ్మోహన్ రావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పెనుమత్స సాంబ మూర్తి రాజు ఆధ్వర్యంలో గీత పారాయణం, సత్సంగ ప్రవచనం కార్యక్రమం జరిపారు.
అన్నమయ్య: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద ఆశా కార్యకర్తలకు వేసిన డ్యూటీని ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద నిపుణులైన డాక్టర్లను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.
ATP: కళ్యాణదుర్గంలో శ్రీరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రజలను, భక్తులను అలరించేందుకు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రి జబర్దస్త్ ప్రోగ్రామ్ జరుగుతోంది. జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు ఏర్పాట్లను రామస్వామి కమిటీ సభ్యులు దగ్గరుండి చేయిస్తున్నారు. సీఐ యువరాజు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ రమేశ్, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
ASR: గ్రామాల్లో ఆలయాల నిర్మాణాల వల్ల ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగి, శాంతి నెలకొంటుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. హుకుంపేట మండలంలోని కొంతిలి గ్రామంలో శనివారం నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక పంచాయతీ సర్పంచ్ రేగం రమేశ్‌తో కలిసి ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్ట చేశారు.
AKP: మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా రేవు పోలవరంకి ఈనెల 11వ తారీకు మంగళవారం సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం వరకు నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి 35 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. నర్సీపట్నం నుండి అడ్డు రోడ్డు వరకు 15 బస్సులు, అడ్డరోడ్డు నుండి రేవు పోలవరం వరకు 15 బస్సులు, కర్రీవానిపాలెం నుండి ఐదు బస్సులు ఉంటాయన్నారు.
KDP: జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిసర ప్రాంతాలలో వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇల్లూరి నాగరాజు, బొబ్బిలి వెంకటరమణ, పొన్న తోట జయరాజు అనే ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
TPT: చిల్లకూరు మండలం కలవకొండలో మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ 16వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సై సురేష్ బాబు చేతుల మీదుగా క్రీడా జెండాను ఎగరవేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని, క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు వేలూరు ఆసుపత్రిలో శనివారం మృతి చెందాడు. రామసముద్రంలోని కర్నాల వీధికి చెందిన వేణు (25) వారం రోజుల క్రితం తమిళనాడులోని వేలూరులో బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వేణును స్థానిక వేలూరు ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజులు మృత్యువతో పోరాడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 14వ వార్డు సుబ్బారాయుడుపాలెంలో శనివారం శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గోపూజ, పునఃపూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరై సీతారాములు దర్శించుకున్నారు.
AKP: నాతవరంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ ఆకట్టుకుంటుంది. రూ.2.6 కోట్లతో దీని నిర్మాణం చేపట్టారు. విశాలమైన గదులతో ఆధునికంగా, ఆకర్షణీయంగా ఈ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభానికి సిద్దంగా ఉంది.
ASR: ప్రభుత్వం ఏదైనా గిరిజన చట్టాల జోలికి వస్తే ఊరుకునేది లేదని, యుద్ధం తప్పదని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ పేర్కొన్నారు. శనివారం కొయ్యూరు మండలంలోని డౌనూరు గ్రామంలో ఆయన పర్యటించారు. 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 11,12వ తేదీల్లో చేపడుతున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.