ప్రకాశం: ఉపాధి హామీ 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను సంతమాగులూరులో బుధవారం నిర్వహిస్తున్నట్లు ఏపీఓ బాలకృష్ణనాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభంకానున్న ప్రజావేదికలో పాల్గొనాలని ఆయన కోరారు
NLR: నగర మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 55 మంది శానిటేషన్ ఇన్స్పెక్టర్లు విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో కార్యాలయంలోని ఆరోగ్య విభాగంలో ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో అవినీతి అక్రమాలు గుర్తించి ప్రభుత్వానికి అప్పట్లో నివేదిక అందించారు.
GNTR: ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ప్రకాశం: త్రిపురాంతకం మండల పరిషత్ ఎన్నికల విషయంలో కూటమి చేసిన అక్రమాలు, అరాచకాలను బయట పెడతామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. జిల్లా జైలులో ఉన్న ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించి తాటిపర్తిలో మీడియాతో మాట్లాడారు. ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆంజనేయరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమేనన్నారు.
NLR: జిల్లాలోని అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025-26 సంవత్సరానికి గాను 5,6,7,8 తరగతులలో ప్రవేశం ఉందని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఆన్లైన్ https://aprs.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చుసుకోవాలన్నారు. ఈ నెల 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
BPT: బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PLD: క్రోసూరు మండలంలోని ఉయ్యందన గ్రామంలో శ్రీలక్ష్మి అనే మహిళ తమ్మిశెట్టి చిరంజీవిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో ఈ దాడి చేసినట్లు యువతి స్థానికులకు తెలిపింది. కాగా క్షతగాత్రుడిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: గంజాయి కేసును ఛేదించినందుకు గాను బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావును ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఫిబ్రవరి 10న కారులో తరలిస్తున్న గంజాయిని రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్ట్ వద్ద పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు. ఈ కేసును సమగ్ర దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేయడంతో రూరల్ సీఐ నారాయణరావుకు ప్రశంస పత్రం ఇచ్చి ఎస్పీ అభినందించారు.
ATP: గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ నందుగల అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఎవరు లేని సమయంలో హుండీ తాళాలు పగలగొట్టి సుమారు రూ. 20,000 నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TPT: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం సమావేశమయ్యారు. నగరంలోని చెరువులలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బన్సల్, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు
NTR: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి పాలకొల్లు వెళ్తున్న ఏపీ39 HQ6336 కారుకు బైకు అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ఒకే వైపు వస్తుండగా జరిగినా ఈ ప్రమాదంతో పొదల్లోకి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్ళింది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ASR: సదరం ధృవపత్రాలు జారీ చేయడం కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కొయ్యూరు ఎంపీడీవో ఎస్కేవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ధృవపత్రాలు అవసరమైన వవారు ముందుగా స్లాట్లు బుక్ చేసుకోవాలన్నారు. ఈనెల 4న మండలంలోని గ్రామ సచివాలయాలు, మీసేవా కేంద్రాల్లో స్లాట్లు నమోదు చేస్తారన్నారు. ఈమేరకు తమ పరిధిలోని కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.
BPT: బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు పోలీసులు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించమని హెచ్చరించారు. అనునిత్యం పట్టణంలో పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు.
ELR: ఆధునిక సాంకేతిక అంశాలపై అవగాహన విద్యార్హత కలిగిన వారికి వర్క్ ఫ్రమ్ హోం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన సర్వేను యుద్ధప్రాతిపధికన పూర్తిచెయ్యాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో డీఎల్ డీవోలు, ఎంపీడీవోలు క్షేత్రస్ధాయిలో పర్యటించాలన్నారు.
కడప: పదో తరగతి బాలికపై జేసీబీ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వాల్మీకిపురంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలో ఉండే ఓ మైనర్ బాలిక స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పక్క వీధిలో కాపురం ఉంటున్న జేసీబీ డ్రైవర్ బాలికను లోబర్చుకుని లైంగిక దాడి చేశాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలిక తల్లి దండ్రులు పోలీసులను ఆశ్రయించారు.