• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ముగిసిన జిల్లా పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్

ATP: జిల్లా పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ విజయవంతంగా ముగిసింది. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోసి, జిల్లా ఎస్పీ జగదీష్ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, మెమెంటోలు అందజేసి అభినందించారు. టగ్ ఆఫ్ వార్ విన్నర్స్‌గా జిల్లా ఎస్పీ జట్టు, రన్నర్స్‌గా అదనపు ఎస్పీ జట్టు నిలిచింది. 

February 8, 2025 / 04:09 AM IST

బీటెక్ ఫలితాలు విడుదల

ATP: JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన బీటెక్ 3-1సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ(R15, R19, R20) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం వెబ్‌సైట్https://jntuaresults.ac.inను సందర్శించాలని సూచించారు.

February 8, 2025 / 04:07 AM IST

‘జగన్ సీఎంగా ‌1.O ఒక ప్లాఫ్ ‌సినిమా’

E.G: వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1.O వెర్షన్‌ ఒక ప్లాప్‌ సినిమా అని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మళ్లీ 2.O అంటే ఏంటో చూపిస్తానని చెప్పడం, 30సంవత్సారాలు సీఎంగా ఉంటానని భ్రమల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈసారి 11 సీట్లు కూడా రావని అన్నారు.

February 7, 2025 / 08:19 PM IST

ఉమెన్ సేఫ్టీ యాప్పై అవగాహన

కృష్ణా: విజయవాడ విమానాశ్రయం ప్రాంగణం వద్ద శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమెన్ సేఫ్టీ యాప్ పై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ మేరకు యాప్ సేవల గురించి మహిళా పోలీసులు ప్రయాణికులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. అత్యవసర సమయాలలో ఆపద ఎదురైతే ఈ యాప్ ద్వారా పోలీస్ సిబ్బందికి, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వవచ్చని పోలీస్ సిబ్బంది వివరించారు.

February 7, 2025 / 08:11 PM IST

శ్రీ అన్నపూర్ణేశ్వరిని సన్నిధిలో మాజీ మంత్రి

సత్యసాయి: భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హోరనాడులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఉషశ్రీ చరణ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ మంత్రి వెంట పెనుకొండ వైసీపీ నాయకులు ఉన్నారు.

February 7, 2025 / 07:37 PM IST

పాత కక్షల కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాజు, హాబీబ్ అనే ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 7, 2025 / 07:35 PM IST

జేఏసీ నాయకులపై అక్రమ కేసు కొట్టివేత

ATP: గత వైసీపీ ప్రభుత్వంలో రక్త నిధి కోసం పోరాటం చేస్తున్న గుంతకల్లు జేఏసీ నాయకులు మీద అక్రమంగా పెట్టిన కేసును శుక్రవారం గుంతకల్లు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టి వేసిందని జేఏసీ నాయకులు మంజుల వెంకటేష్,చక్రపాణి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రక్త నిధి కోసం నిరసనలు చేశామన్నారు.

February 7, 2025 / 06:55 PM IST

‘గర్భిణీలకు పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’

ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గర్భిణీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి టీడీపీ మండల ఇంచార్జ్ నారాయణ, ఆసుపత్రి సూపరిండెంట్ ఎల్లప్ప చేతుల మీదుగా గర్భిణీలకు భోజనాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 7, 2025 / 06:39 PM IST

శివరాత్రికి ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచండి

PLD: మహా శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కోటప్ప కొండపై ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోటప్పకొండ ఈవోను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని అంబేడ్కర్ సమావేశ మందిరంలో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

February 7, 2025 / 05:26 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ బీజేపీ యువ నాయకులు

NDL: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను ఢిల్లీలో డోన్ పట్టణానికి చెందిన ఏపీ బీజేపీ యువ నాయకులు కొట్టె మల్లికార్జున శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించామన్నారు.

February 7, 2025 / 05:18 PM IST

తాళ్లూరు మండల సర్పంచ్‌కు వైసీపీ కీలక పదవి

ప్రకాశం: YS జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డిని జిల్లా వైసీపీ సెక్రటరీగా పార్టీ అదిష్టానం నియమించింది. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, జిల్లా వైసీపీ ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇంకా పార్టీ పట్ల బాధ్యత పెరిగిందని, తన పదవికి న్యాయం చేస్తానని అన్నారు.

February 7, 2025 / 05:01 PM IST

‘భారతీయులను చేతికి సంకెళ్లు వేసి పంపడం అమానుషం’

KRNL: అమెరికాలోకి అక్రమ వలసల నివారణలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వలసలు వచ్చిన ప్రజలను వారి దేశాలకు పంపే విధానంలో భారతీయుల చేతికి, కాళ్లకు సంకెళ్లు వేసి యుద్ధ విమానంలో పంపడం అమానుషమని పీడీయస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ అన్నారు. ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా భారత్‌ను మిత్రదేశంగా చెప్పుకుంటూ ఇలా చేయడం సరికాదన్నారు.

February 7, 2025 / 04:55 PM IST

నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి

GNTR: ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫిరంగిపురం ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ 1-19 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించడం జరుగుతుందని అన్నారు.

February 7, 2025 / 04:52 PM IST

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డీఎస్పీ

ప్రకాశం: కనిగిరిలోని సబ్-డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ యశ్వంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసులు, నేరాల సంఖ్య, కేసుల దర్యాప్తు స్థితి తీసుకునే చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ స్పష్టం చేశారు.

February 7, 2025 / 04:48 PM IST

కలెక్టర్‌తో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి భేటీ

ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ తమిమ్ అన్సారీయను ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 7, 2025 / 04:43 PM IST