KDP: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. మంగళవారం కడప నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకనబరిచిన సీఐ లింగప్ప, ఎస్ఐలు చాంద్ బాషా, శ్రీనివాసులు, మైనుద్దీన్లతో పాటు పలువురు పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
KDP: మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు 317 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు మైలవరం జలాశ అధికారులు తెలిపారు. నదీ పరివాహ గ్రామాలకు తాగునీటి అవసరార్థం నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మైలవరం జలాశయానికి ఎటువంటి ఇన్‌ఫ్లో లేదని తెలియజేశారు.
కోనసీమ: ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో MLA బండారు సత్యానందరావు హాజరయ్యారు. మండలంలో 1, 2, 3వ స్థానంతో పాటు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను MLA దుశ్శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
KRNL: ఏపి ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి వేగంగా జరిగేందుకు పూర్తిగా సహకరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను పరిశ్రమల శాఖ మంత్రి భరత్ కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై భరత్ చర్చించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
KRNL: నందికొట్కూరు పట్టణం ఎఐటీయుసీ కార్యాలయం నందు మంగళవారం ఆటో కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటీయుసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వి. రఘురాంమూర్తి మాట్లాడుతూ.. నందికొట్కూరు పట్టణంలో 139వ మే డే సందర్భంగా ఎఐటీయుసీ అనుబంధ ప్రజా సంఘాలకు ఎర్రజెండాను ఎగర వెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
KRNL: ఆదోని తాత్కాలిక మున్సిపల్ ఛైర్మన్‌గా నియమితులైన మొహమ్మద్ గౌస్‌ను MLC మధుసూదన్ ఇవాళ సన్మానించారు. ఈనెల 16వ తేదీన ఛైర్ పర్సన్ శాంతను YCP సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దించిన సంగతి తెలిసిందే. దీంతో శాశ్వత ఛైర్మన్ ఎన్నిక అయ్యేంతవరకు తాత్కాలికంగా వైస్ ఛైర్మన్ ను ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఎన్నుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ATP: రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి రాయదుర్గంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. వైసీపీ పార్టీ మరింత అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారన్నారు.
బుచ్చి మండలం నాయగుంట గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన రఫీ ఈ ఘటనలో మృతి చెందారు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన కొందరు కత్తులతో, కర్రలతో దాడి చేశారని బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి, ఆస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సత్యసాయి: ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మే 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు నాగేంద్ర కోరారు. మంగళవారం శిబిరానికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాలవారు కూడా శిబిరానికి హాజరుకావాలని సూచించారు.
KRNL: మేడే ఉత్సావాలకు ప్రతి కార్మికుడు సిద్ధంకావాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ, AITUC మండల కార్యదర్శి చిన్నరాముడు, ఆటో యునియన్ నాయకులు పిలుపునిచ్చారు. మేడే దినోత్సవం సందర్భంగా కోడుమూరులో ఎద్దుల మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన 100 రెడ్ టీ షర్టులను హమాలీలకు మంగళవారం పంపిణీ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడే రోజుగా జరుపుకుంటామని తెలిపారు.
TPT: గంగమ్మ ఆలయ అధికారులు మంగళవారం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్‌ను కలిశారు. ఇందులో భాగంగా గంగమ్మ జాతర ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. జాతరకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు.
సత్యసాయి: రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సహచర నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశాబ్దాలుగా బీజేపీ విస్తరణకు సత్యనారాయణ ఎంతో కృషి చేశారని మంత్రి కొనియాడారు.
NLR: అల్లూరు మండల ప్రజలకు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీనారాయణ పలు సూచనలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా రానున్న రోజుల్లో ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప ఉదయం 10:00 గం // నుండి సాయంత్రం 4:00 గం// మధ్యలో బయటకు రాకూడదని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ATP: నగరంలోని సాయి నగర్ మొదటి క్రాస్‌లో మంగళవారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని అనంత ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఇదే కూటమి ప్రభుత్వం విధానమని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SKLM: పాతపట్నం మండలంలోని ఏఎస్ కవిటి గ్రామానికి చెందిన సర్పంచ్ నక్క మార్కండేయులు, కోగాన సంజీవరావు ఆహ్వానం మేరకు గ్రామదేవత ఉత్సవాలలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తీర్ధ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.