• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

PPM: సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం మున్సిపల్ కమీషనర్ సీ.హెచ్.వేంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని వీధి దీపాలపై ఫిర్యాదు అందిన తక్షణం మరమతులు నిర్వహించి దీపాలు వెలిగేటట్లుగా చేయడం జరుగుతుందన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణంపై ఫిర్యాదుల మేరకు చేపడతామని చెప్పారు.

May 1, 2025 / 04:24 AM IST

సింహాచలం ఘటన బాధాకరం

SKLM: సింహాచలంలో జరిగిన ఘటన బాధాకరమైన విషయమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదని వివరించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన కోరారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

April 30, 2025 / 08:17 PM IST

బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేయాలి

ప్రకాశం: బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వెలిగండ్ల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని గంధం కృపవరం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఐటిసి బంగారు బాల్యం, కిషోర్ వికాసం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కరపత్రాలను ఆవిష్కరించారు.

April 30, 2025 / 08:17 PM IST

కళా వెంకటరావుని పరామర్శించిన ఎమ్మెల్యే

VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కంటికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన బుధవారం రాజాంలోని కళా వెంకటరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శ అల్లాడ భాస్కరరావు ఉన్నారు.

April 30, 2025 / 08:16 PM IST

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

BPT: ఇంకొల్లు మండలం పాత మద్రాసు రోడ్డు కొనికి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. చెట్ల మధ్య మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరు?, ఎందుకు చనిపోయాడు?, హత్య, ఆత్మ హత్య అన్న విషయాలు తెలియాల్సి ఉందని ఇంకొల్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు.

April 30, 2025 / 08:02 PM IST

రోడ్డు ప్రమాదంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

NLR: కోవూరు (మం) పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైవేపై అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లగా, ఇంట్లోని వ్యక్తితోపాటు, ఐదుగురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన బాధాకరమని, గాయాలతో బయటపడ్డ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

April 30, 2025 / 07:59 PM IST

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ నాయకులు

NTR: గంపలగూడెం మండలానికి చెందిన టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఐలూరి భార్గవరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొండ ఉపేందర్ రెడ్డి, ఆడెపు ఉదయ వెంకట సాయి తదితరులు వైసీపీలోకి చేరారు.

April 30, 2025 / 07:39 PM IST

టీడీపీలోకి చీరాల మున్సిపల్ ఛైర్మన్

BPT: తన మీద టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో వైసీపీకి చెందిన చీరాల మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అధికార పార్టీలో చేరిపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. శ్రీనివాసరావును వాళ్ళు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

April 30, 2025 / 07:29 PM IST

ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

NLR: కోవూరు (మం) పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై వైసీపీ అధినేత జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైవేపై అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లగా, ఇంట్లోని వ్యక్తితోపాటు, ఐదుగురు మెడికల్ విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన బాధాకరమని, గాయాలతో బయటపడ్డ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

April 30, 2025 / 07:15 PM IST

అనపగుంట పూడికతీత పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణం వైకుంఠపురంలోని అనపగుంట పూడికతీత పనులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనపగుంటలోకి మురుగునీరు చేరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూడికతీత పనులు వలన సమీపంలోని బావుల నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుందని అన్నారు.

April 30, 2025 / 07:04 PM IST

రాజేరులో పౌర హక్కుల దినోత్సవం

VZM: బొండపల్లి మండలంలోని బి రాజేరు గ్రామంలో బుధవారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం బొండపల్లి ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొబ్బిలి డీఎస్పీ భవ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పౌర హక్కులను కాపాడుకోవాలని సూచించారు. పల్లెలు ప్రశాంత వాతావరణంలో ఉండాలన్నారు.

April 30, 2025 / 06:46 PM IST

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం

SKLM: మత్స్యకారులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. పోలాకి మండలం రాజారాంపురం గ్రామంలో బుధవారం సాయంత్రం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకార కుటుంబాలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

April 30, 2025 / 06:33 PM IST

దేవస్థాన భూములకు వేలం పాట

NLR: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు శ్రీరామ మందిరం దేవస్థాన భూములకు మే నెల 7వ తేదీన వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి మోహన్ కుమార్ తెలియజేశారు. దాదాపుగా 8 ఎకరాల 84 సెంట్లకు (8.84) దేవస్థానానికి సంబంధించిన భూములకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల కాల పరిమితికి వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

April 30, 2025 / 06:18 PM IST

కారు ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే దిగ్బ్రాంతి

NLR: కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందడంపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

April 30, 2025 / 06:07 PM IST

‘456 మట్టి నమూనాలను సేకరించాం’

NLR: విడవలూరు మండల వ్యాప్తంగా 2025-26 సంవత్సరానికి గాను 456 మట్టి నమూనాలు సేకరించినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. మట్టి నమూనా పరీక్షలు ఆధారంగా రైతులందరూ తమ పంటల్లో ఎరువులు పురుగు మందులు వాడుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులందరూ దృష్టి పెట్టాలన్నారు.

April 30, 2025 / 06:02 PM IST