అనంతపురం: రంజాన్ మాసంను పురస్కరించుకుని అనంతపురం నగరంలోని 2వ రోడ్ వద్ద ఉన్న బాబుద్ధిన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం హాజరయ్యారు. మసీదు నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మసీదు కమిటీ మెంబర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ELR: టి.నరసాపురం మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన ముగ్గురుని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలు అయిన గుమ్మల్ల లక్ష్మణరావు, కొండా పుల్లయ్య, రాచప్రోలు అరుణ్ అనే వ్యక్తులపై బైండోవర్ విధించడం జరిగిందన్నారు. సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం గంపనంపల్లికి చెందిన పవిత్ర (17) తిరుపతిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20న జ్వరం రావడంతో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో రుయా ఆసుపత్రికి తరలించగా.. ఇవాళ చికిత్స మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్నమయ్య: సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె పాత జంగంపల్లెలో జరగనున్న శ్రీ గౌరిసమేత జంగమేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, కల్యాణ మహోత్సవాలకు హాజరు కావాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ప్రసాద్ బాబును గ్రామస్తులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 51 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
కృష్ణా: సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ తనిఖీ చేశారు. గోడౌన్ సీల్‌ను, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఎన్నికల భద్రత దృష్ట్యా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.
ప్రకాశం: కంభం పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు స్థానిక ఎస్సై శివ కృష్ణారెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు నడుపుతున్న వాహనాలను స్వాధీనం చేసుకొనివాహన యజమానులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్ ఇచ్చి, జరిమానా విధించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చివారు రోడ్డు ప్రమాదానికి కారణమైతే వాహన యజమానిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
తూ.గో: రాజమండ్రి ఆవ వాంబే కాలనీలో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యను ఆర్ఎమ్‌సీ అధికారులు సోమవారం పరిష్కరించారు. డ్రైనేజీలు పూడికతో నిండి మురుగు నిలిచిపోవడంతో, స్థానికులు ‘జనతా వారధి’ వేదికలో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన అధికారులు జేసీబీలతో మురుగును తొలగించి శుభ్రం చేశారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
PPM: ఫిర్యాదు చేసిన వ్యక్తి పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం తొమ్మిది పిర్యాదులు వచ్చాయన్నారు.
AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 2016లో తీసుకున్న భూములకు రేటు పెంచాలని మత్యకారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. అప్పుడు ఎకరం రూ.18 లక్షల మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రేట్ల ప్రకారం రూ.32 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని వారికి తెలిపారు.
GNTR: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాత్ ల్యాబ్, కార్డియాక్ OTలను ప్రారంభించి, అనంతరం కాలేజీ 22వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
W.G: ఉండి మండలం మహాదేవ పట్నం హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ సోమవారం పంపిణీ చేశారు. పూర్వపు విద్యార్థి,దాత అల్లూరి రామకృష్ణంరాజును ఆమె అభినందించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ జుత్తిగ నాగరాజు, జిల్లా D.E.O. నారాయణ, సమగ్ర శిక్ష A.P.C.శ్యాం సుందర్, H.M. ఎం.జాన్ బాబు పాల్గొన్నారు.
KRNL: ఎమ్మిగనూరు ఆటోలు లైన్లో పెట్టుకునే విషయంలో హనుమాపురానికి చెందిన నవీన్, రామాంజి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణగా మారి పరస్పరం దాడులు, ఆటోల అద్దాల ధ్వంసానికి దారితీసింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు 14 మందిపై కేసునమోదు చేసినట్లు SI నిరంజన్ రెడ్డి తెలిపారు.
TPT: ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 138 మందిలో 133 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగాయన్నారు. ఏర్పేడు సీఐ బి. శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
KDP: సింహాద్రిపురం సీఐ వెంకట రమణ, ఎస్సై అనిల్ కుమార్‌లను లంచం కేసులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన సమాచారం మేరకు, అధికారులపై మొత్తం రూ.700,000 డిమాండ్ ఆరోపణలు రావడంతో, చివరికి రూ.4 లక్షలకు డీల్ కుదిరినట్లు తెలిపారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.