ప్రకాశం: పుల్లలచెరువు మండలం చాపలమడుగు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రుజువుకావడంతో పంచాయతీ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ రాజబాబు సస్పెండ్ చేశారు. నిధుల వినియోగంపై నిర్వహించిన విచారణలో అవకతవకలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
TPT: సత్యవేడు పట్టణంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల సొమ్ము పంపిణీ జరగనుంది. టీడీపీ నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఉదయం 9 గంటలకు నేతాజీ రోడ్డు, గాంధీ రోడ్డు ప్రాంతాల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నట్లు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం సెలవు కారణంగా ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
ATP: గుంతకల్లు మండలం వెంకటంపల్లి గ్రామంలోని పెద్ద కదిరప్ప స్వామి దేవాలయానికి రూ.45 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి తహశీల్దార్ రమాదేవి మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి హాజరయ్యారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో ఏలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
సత్యసాయి: కొత్తచెరువులోని పురాతన సోమేశ్వర స్వామి ఆలయానికి గ్రీన్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంట సామాగ్రిని పంపిణీ చేశారు. భక్తుల కోరిక మేరకు ప్రసాదాల తయారీ, శుభకార్యాల కోసం అవసరమైన పాత్రలు, బకెట్లు, జగ్గులను టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ అందజేశారు. సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
PLD: రాజాపేట ఏపీ గురుకుల పాఠశాలలో (బాలురు) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదలైంది. 5వ తరగతిలోని 80 సీట్లతో పాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24న జరగనుంది. ఎంపికైన వారికి వసతి, ఉచితంగా అందిస్తారు.
CTR: వెదురుకుప్పం మండల కేంద్రంలో దిగువ పల్లాలు గ్రామానికి చెందిన బోడిరెడ్డి మోహన్ రెడ్డి తన సొంతంగా ఫోటో స్టూడియో, సాధారణ సేవల కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.
కోనసీమ: ఉన్నత చదువులకు తొలి మెట్టైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివరాలు శుక్రవారం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు.
E.G: ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ముసాయిదాపై అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత ఆదాయ వనరులు, పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లకు సంబంధించిన పద్దులపై సుదీర్ఘంగా చర్చించారు.
తూ.గో: ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ముసాయిదాపై అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత ఆదాయ వనరులు, పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లకు సంబంధించిన పద్దులపై సుధీర్ఘంగా చర్చించారు.
కోనసీమ: జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ఈనెల 26 నుంచి ప్రారంభమైందని ఆ పార్టీ మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య తెలిపారు. చొప్పెల్ల గ్రామంలో పార్టీ నియమించిన నాయకులతో శుక్రవారం సభ్యత్య కార్యక్రమాన్ని నిర్యహించారు. కొణిదల పవన్ కళ్యాణ్ సభ్యత్వ రుసుమును రూ.400కు తగ్గించారని, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు తెలిపారు.
GNTR: కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం రూ. 26 వేలు, గ్రాట్యుటీ, మే నెల సెలవులు కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న అంగన్వాడీలు, సమస్యల పరిష్కారం కోసం మార్చి 2న చేపట్టే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్షురాలు రమణ పిలుపునిచ్చారు.
TPT: వెంకటగిరి-ఏర్పేడు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి ఏర్పేడు వైపు వస్తున్న కారు దుగ్గిపేరి వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని అంబులెన్సులో తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.
PPM: మన్యం జిల్లాలో చేపట్టబోయే జనగణన 2027 ప్రక్రియను నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మండల అధికారులకు పిలుపునిచ్చారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. గడువు వరకు వేచి ఉండకుండా ముందస్తు ప్రణాళికతో పని చెయ్యాలన్నారు.
E.G: మార్చి 2026లో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఉన్న వివరాల సవరణకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. రేపటి వరకు సవరణలకు అవకాశం ఉందన్నారు. విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 5వ రోజు అయిన శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ, బాటని, ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1538 మంది హాజరు కావాల్సి ఉండగా 1372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1500 మంది రాయాల్సి ఉండగా 1377 మంది విద్యార్థులు రాశారు.