»South Central Railway Some Trains Cancelled In Vijayawada Division Alert For Passengers Upto July 17th 2023
Trains: నేటి నుంచి 17 వరకు విజయవాడ డివిజన్లో పలు ట్రైన్స్ రద్దు
మరమ్మతు పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరి కొన్ని ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(south central railway) అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జులై 11 నుంచి 17వ తేదీ వరకు పలు ట్రైన్స్ రద్దవుతాయని వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.
some trains are closed upto September 11th 2023 vijayawada division
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్(vijayawada division)లో భద్రతా పనుల దృష్ట్యా కొన్ని రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూలై 10 నుంచి జూలై 16 వరకు రైలు నెం.17239 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి విశాఖపట్నం ట్రైన్ రద్దు చేయబడింది. జూలై 11 నుంచి జూలై 17 వరకు రైలు నెం.17240 గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి విశాఖపట్నం ట్రైన్ రద్దు చేయబడింది. జూలై 10 నుంచి జూలై 16 వరకు అప్ అండ్ డౌన్ కాకినాడ-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్, అప్ అండ్ డౌన్ విశాఖపట్నం-రాజమండ్రి ప్యాసింజర్ స్పెషల్ రద్దు చేయబడ్డాయి. అలాగే జూలై 10 నుంచి జూలై 16 వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ(17267-17268), రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం(07466-07467) ట్రైన్లను కూడా రద్దు చేశారు.
ఈ రైళ్లు(trains) సాధారణ నిడదవోలు-ఏలూరు-విజయవాడ కాకుండా నిడదవోలు-భీమవరం టౌన్-గుడివాడ-విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయి. రైలు నెం. 13351 ధన్బాద్-అలెప్పి బొకారో ఎక్స్ప్రెస్ జూలై 11, 14, 15 తేదీల్లో ధన్బాద్లో బయలుదేరి తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్ల ద్వారా దారి మళ్లించబడుతుంది. రైలు నెం.12889 టాటా నగర్-SMV బెంగళూరు ఎక్స్ప్రెస్ జూలై 14న టాటా నగర్ నుంచి బయలుదేరుతుంది. రైలు నెం.18637 హటియా-SMV బెంగళూరు ఎక్స్ప్రెస్ జూలై 15న హటియా నుంచి మొదలవుతుంది. రైలు నెం.12835 హటియా-SMV బెంగళూరు ఎక్స్ప్రెస్ జూలై 11న హటియా నుంచి బయలుదేరుతుంది.