ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలులో ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఒంగోలులో దేవుడు చెరువు, గద్దలగుంట, సీతారాంపురం ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.