»Chandrayaan 3 Launch On July 14 A Failure Oriented Approach
ISRO : జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగం ..ఫెయిల్యూర్ ఆధారిత విధానం
అంతరిక్ష నౌకను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగానికి రంగం సిద్దమైంది. జులై 14న మధ్యాహ్నం 2.35కి ఈ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.చంద్రయాన్ 2 (Chandrayaan 2) తో పోలిస్తే చంద్రయాన్-3ని ఫెయిల్యూర్ ఆధారిత విధానంతో అభివృద్ధి చేశామని తెలిపింది. చంద్రయాన్-2లో సమస్య ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే.. పెరామీటర్ (parameter)వేరియేషన్ లేదా విభాగాలను వేరుచేసే వ్యవస్థను (Dispersion) నిర్వహించే సామర్థ్యం చాలా పరిమితమే. అందుకే ఈసారి ఆ సామర్థ్యాన్ని మరింత పెంచాం. చంద్రయాన్-2ను సక్సెస్ ఆధారిత మోడల్లో రూపొందించగా.. చంద్రయాన్-3లో మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్‌ను అమలు చేస్తున్నాం. ఏదైనా వ్యవస్థ విఫలమైనప్పుడు, దాన్ని ఎలా రక్షించాలనే విధానమే ఇది’ అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్(Chairman S Somnath) తెలిపారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్-3 జులై 14న నింగిలోకి దూసుకెళ్లనుంది. సుమారు 3.84లక్షల కి.మీ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో జాబిల్లి(Jabilly)పై చంద్రయాన్-3 అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ఈ రోవర్‌ను దించేందుకు ఇస్రో (ISRO) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ చంద్రుడిపైకి భారతీయ అంతరిక్ష యాత్రలో ఈ ప్రయోగం కీలక ఘట్టంగా ఉంటుంది. చంద్రుడిపై రోవర్‌ను విజయవంతంగా దింపేందుకు ఇస్రో చేస్తున్న మూడో దఫా ప్రయత్నం ఇది .ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట(Sriharikota)లోని అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని పరీక్షిస్తారు. ఇస్రోకు చెందిన నూతన నిర్మిత వాహకనౌక ఎల్విఎం 3 ద్వారా ప్రయోగం ఉంటుంది. దీనికి అవసరం అయిన క్యాప్సూల్స్, ఇతరత్రా శాస్త్రీయ పరికరాల అనుసంధాన ఏర్పాట్లు విజయవంతం అయ్యాయి.